Tuesday, 3 November 2026

‘మౌన’దీక్ష అపహాస్యం

ముచ్చట్లు, మంతనాలతో కిరణ్‌
ఢిల్లీ, సీమాంధ్ర నుంచి కరువైన ఆదరణ
నాయకులే తప్ప కానరాని జనం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) :
సీఎం కిరణ్‌ మౌనదీక్షను అసహాస్యం చేశాడు. ముచ్చట్లు, మంతనాలతో సత్యాగ్రహానికే తీరని అవమానాన్ని మిగిల్చాడు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కిరణ్‌ చేపట్టిన మౌనదీక్ష కేవలం నాలుగు గంటలే సాగింది. ఆ దీక్ష యావత్‌ ఆయన నవ్వులు, ముచ్చట్లతోనే సాగించాడు. కిరణ్‌ దీక్షను సీమాంధ్ర ప్రజలు కూడా పట్టించుకోలేదు. ఢిల్లీలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న సీమాంధ్ర ప్రజలు కూడా జంతర్‌ మంతర్‌ వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో ఆయన దీక్ష దుస్సుమంది. ఈ సందర్భంగా కిరణ్‌ మాట్లాడుతూ, రాష్ట్రపతిపై, రాజ్యాంగంపై తమకు పూర్తి నమ్మకం ఉందని విబజన జరక్కుండా చూడాలని కోరామని కిరణ్‌ అన్నారు. రాష్ట్రపతి సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఆంధప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల అభీష్టం నెరవేరుతుందని ఆకాంక్షిస్తున్నానన్నారు. అసెంబ్లీ తిరస్కరించిన పంపింప తరవాత దేశంలో గతంలో విభజన జరిగిన దాఖలాలు లేవని అన్నారు. జంతర్‌మంతర్‌ వద్ద దీక్ష ముగించాక మంత్రులు, ఎమ్మెల్యేలు, పిసిసి చీఫ్‌ బొత్స తదితరులతో కలసి ఆయన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలసి వినతి పత్రం అందజేశారు. విభజన జరిగితే సాగునీరు, విద్యుత్‌ సహా పలుసమస్యలు తలెత్తుతాయని, తెలంగాణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రజల అభీష్టం మేరకే విభజన జరగాలని, 80 శాతం ప్రజలు సమైక్యాన్ని కోరుకుంటున్నారని రాష్ట్రపతికి వివరించామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజలకు మేలు జరగడానికి విభజన జరగాలి కానీ నష్టం జరగడానికి కాదన్నారు. అందుకే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. జంతర్‌మంతర్‌ వద్ద మౌనదీక్ష అనంతరం సీఎంతో పాటు సీమాంధ్ర నేతలు రాష్ట్రపతితో భేటీ అయ్యారు. విభజన బిల్లు లోపభూయిష్టంగా ఉందని రాష్ట్రపతికి తెలపడం జరిగిందన్నారు. 75-80 శాతం మంది ప్రజలు సమైక్యం కోరుకుంటున్నారని, విభజన కావడం వల్ల తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు నష్టం జరుగుతుందన్నారు. విభజన బిల్లును ఆంధప్రదేశ్‌ అసెంబ్లీ తిరస్కరించడం జరిగిందని గుర్తు చేశారు. తిరస్కరించిన తరువాత రాష్ట్రం ఏర్పడలేదని, రాష్ట్రపతి ఆర్టికల్‌ 3ని ఉపయోగించాలని, రాష్ట్రం విడిపోకుండా రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకం ఉందని సీఎం పేర్కొన్నారు. లెటర్‌ లో ఆంధప్రదేశ్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అని పేర్కొన్నారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వివరాలు, గతంలో కమిషన్‌ వివరాలు, ఆర్టికల్‌ 3 వివరాలు పొందుపరిచారు.మరోవైపు సాయంత్రం రాష్ట్రపతితో సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఏకాంతంగా ఐదు నిమిషాల పాటు సమావేశమైనట్లు వార్తలు వస్తున్నాయి. సీమాంధ్ర ప్రజాప్రతినిధులతో కలిసి వెళ్లినా సీఎం మాత్రం ఐదు నిమిషాల పాటు రాష్ట్రపతితో ఏకాంతంగా భేటీ జరిపారు. ఈ భేటీలో ఏమి మాట్లాడారో తెలియడం లేదు. ఈ విషయంలో రాష్ట్రపతి ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదని సమాచారం. అంతకుముందు రం మధ్యాహ్నం నుండి సాయంత్రం 4 గంటల వరకు సీఎం కిరణ్‌ జంతర్‌ మంతర్‌ వద్ద దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో సీఎంతో పాటు పిసిసి చీఫ్‌ బొత్స, సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జంతర్‌ మంతర్‌ వద్ద చేస్తున్న దీక్షను విరమించారు. తరువాత ఆయన నేరుగా రాష్ట్రపతి భవన్‌ కు బయలు దేరారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం ఎపి భవన్‌కు చేరుకున్నారు. రాత్రికి ప్రత్యేక విమానంలో సీఎం, ఇతర నేతలు హైదరబాద్‌ తిరుగు ప్రయాణం అవుతారని తెలుస్తోంది. సీఎం దీక్షకు సీమాంధ్ర ఉద్యోగులు సంఘీభావం ప్రకటించారు. సేవ్‌ డెమోక్రసీ.. సేవ్‌ ఆంధప్రదేశ్‌ ప్ల కార్డులు ప్రదర్శించారు. మౌన దీక్షలో కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, చిరంజీవి, పురంధేశ్వరి, ఎంపీలు లగడపాటి, రాయపాటి, కేవీపీ తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే అంతకుముందు ఏపీ భవన్‌ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తెలంగాణ నాయకులు, సీమాంధ్ర నాయకులు ఆందోళనలతో అట్టుడికిపోయింది. ముఖ్యమంత్రి చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపేందుకు వచ్చిన సీమాంధ్ర నేతలు సీఎంకు మద్దతుగా నినాదాలు చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి దీక్షకు వ్యతిరేకంగా తెలంగాణ నాయకులు నినాదాలతో ¬రెత్తించారు. ఈ క్రమంలో ఇరు ప్రాంతాల కార్యకర్తలు కొట్టుకున్నారు. సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ తెలంగాణ నేతలు నినాదాలు చేశారు. వీరికి పోటీగా సీమాంధ్ర కాంగ్రెస్‌ కార్యకర్తలు సీఎం మద్దతుగా నినాదాలు చేశారు. ఈ దశలో ఇరు వర్గాల పోటా పోటీ నినాదాలు చేసుకోవడంతో..అక్కడ తోపులాట జరిగింది. ఒకరిపై మరొకరు పడి కొట్టుకున్నారు. మరికొందరు ఏపీ భవన్‌లో బైఠాయించి ఆందోళన చేశారు. పరిస్థితిని అదుపులోకి తేవటానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. బారికేడ్లు అడ్డుపెట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *