Tuesday, 3 November 2026

రాజ్యసభలో మతహింస బిల్లుపై రభస


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) :
పార్లమెంట్‌ సమావేశాలు బుధవారం వాయిదాల మధ్య ప్రారంభమయ్యాయి. రాజ్యసభ సమావేశవుతూనే విపక్ష సభ్యుల ఆందోళనలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభ్యుల ఆందోళన మధ్యే కేంద్ర ¬ం మంత్రి షిండే మత హింస నిరోధక బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. సీమాంధ్ర ఎంపీలు ఆందోళన చేస్తుండగా సభలో బిల్లును ఎలా ప్రవేశపెడతారని బీజేపీ సభ్యుడు వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. సభ నిర్వహణ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మతహింస నిరోధక బిల్లుకు వ్యతిరేకంగా బిజెపి సభ్యులు నినాదాలు చేశారు. సీమాంధ్ర సభ్యులు ఛైర్మన్‌ పోడియం వద్దకు చేరుకుని సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో ఛైర్మన్‌ సభను రెండుసార్లు వాయిదా వేశారు. అనంతరం మతహింస నిరోధక బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో గందరగోళం నెలకొంది. బిల్లుపై ¬ంమంత్రి షిండే వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుపట్టడంతో కాసేపు గందరగోళం నెలకొంది. బిల్లు ప్రవేశ పటెట్‌ఇన తీరుపై బిజెపి విరుచుకుపడింది. దీనిని ఎలా ప్రవేశ పెడతారని వెంకయ్య మండిపడ్డారు. ఓ వైపు సీమాంధ్ర సభ్యులు ఆందోళన చెందుతుంటే బిల్లు పెట్టడమేంటని ప్రశ్నించారు. మంత్రి కపిల్‌ సిబల్‌ మాట్లాడేందుకు రాజ్యసభ డెప్యూటీ చైర్మన్‌ అనుమతి ఇచ్చారు. బిజెపి బిల్లును వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అరుణ్‌ జైట్లీ మాట్లాడుతూ సభకు ఇలాంటి బిల్లు తెచ్చే అర్హత లేదని పేర్కొన్నారు. మతహింస నిరోధక బిల్లు సమాఖ్య స్ఫూర్తికి అవరోధం కాదని, రాష్ట్రాల హక్కులను హరించదని, విపక్షాలు లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని, బాధితులకు పరిహారం అందించడమే బిల్లు ముఖ్య ఉద్దేశమని మంత్రి కపిల్‌సిబల్‌ పేర్కొన్నారు. రాష్ట్రాలపై పెత్తనం చేసేందుకే మతహింస నిరోధక బిల్లు అని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు మైత్రేయన్‌ పేర్కొన్నారు. వాయిదా అనంతరం రాజ్యసభ సమావేశం ప్రారంభమయ్యాక మతహింస నిరోధక బిల్లుపై చర్చ చేపట్టారు. మతహింస నిరోధక బిల్లును బిజెపితో పాటు ఎఐడిఎంకె, సిపిఐ, సిపిఎంలు తీవ్రంగా వ్యతిరేకించాయి. శాంతిభద్రతలు కేవలం రాష్ట్రానికి సంబంధించినవని, కేంద్రం పరిధిలోనివి కావని బిజెపి నేత అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. సీమాంధ్ర టిడిపి ఎంపీలు రాజ్యసభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ సమైక్యాంధ్ర నినాదాలు చేస్తున్నారు. సీమాంధ్ర ఎంపీల ఆందోళన మధ్యే రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్‌ సిబాల్‌ జవాబు ఇస్తూ…మతహింస నిరోధక బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కల్గించదని తెలిపారు. ఈ బిల్లు వల్ల రాష్టాల్ర హక్కులకు భంగం కలగదని పేర్కొన్నారు. మత హింస చెలరేగినప్పుడు రాష్ట్రాల అభ్యర్థన మేరకే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని మంత్రి వివరణ ఇచ్చారు. కాగా, విఐపిలకు హెలికాప్టర్ల కొనుగోలు కోసం అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కంపెనీతో ప్రభుత్వం కుదుర్చుకున్న కాంట్రాక్టుపై చర్చ చేయాలని పట్టుబట్టిన సమయంలో రాజ్యసభలో బుధవారం వెంకయ్య నాయుడు ఆగ్రహంతో ఊగిపోయారు. వెస్ట్‌ ల్యాంగ్‌ హెలికాప్టర్ల కుంభకోణంపై రాజ్యసభలో రభస చోటుచేసుకుంది. బుధవారం ఉదయం రెండుసార్లు వాయిదా పడిన తర్వాత తిరిగి రాజ్యసభ ప్రారంభమైనప్పుడు వెస్ట్‌ల్యాండ్‌తో కుదుర్చుకున్న ఒప్పందంపై చర్చ చేపట్టాలని బీజేపీ సభ్యులు రవిశంకర్‌ ప్రసాద్‌, వెంకయ్యనాయుడు పట్టుబట్టారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంలో వెంకయ్య నాయుడు ఆగ్రహంతో ఊగిపోయారు. బిజెపి సభ్యులు వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేయడంతో సభ రెండు గంటల వరకు వాయిదా పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *