Wednesday, 4 November 2026

విభజనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై

సుప్రీకోర్టులో కొనసాగుతున్న విచారణ
ఢిల్లీ: రాష్ట్ర విభజన నిలిపివేయాలని దాఖలైన 9 పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాదులు నారిమన్‌, మోహన్‌లాల్‌ శర్మ వాదనలు వినిపిస్తున్నారు. ఆర్టికల్‌ 3ని ఇష్టానుసారం ఉపయోగిస్తే రాజ్యంగ సమగ్రతకు అర్థం లేదని శర్మ వాదించారు. విభజనకు అసెంబ్లీ అంగీకరించక పోతే పరిస్థితి ఏమిటనే దానిపై కోర్టు స్పష్టద ఇవ్వాలని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. రాష్ట్ర విభజనను నిలిపివేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని సీనియర్‌ న్యాయవాది నారియన్‌ కోర్టుకు విన్నవించారు. ఆర్టికల్‌3 పై రాజ్యంగ ధర్యాసనం స్పష్టత ఇవ్వాలని కోరారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను అనుసరించి తెలంగాణకు ప్రాంతీయ మండలి వేయాలని నారిమన్‌ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తేదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌, పారిశ్రామిక వేత్త రఘరామకృష్ణంరాజు, మరో ఏడుగురు దాఖలు చేసిన అన్ని పిటిషన్లను కలిపి ఒకే సారి సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్‌ జె.ఎల్‌.దత్తు, జస్టిస్‌ బోబ్డేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వీటిని విచారిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *