Wednesday, 4 November 2026

చంప చెఢేల్‌

తెలంగాణ వ్యతిరేక పిటిషన్ల తిరస్కరణ
జోక్యం చేసుకోలేమన్న సుప్రీం
న్యూఢిల్లీ,ఫిబ్రవరి7: సుప్రీంకోర్టులో సీమాంధ్ర నేతలకు ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంలో వేసిన పిటిషన్లను కోర్టు కొట్టేసింది. మొత్తం 9 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. సుమారు గంటన్నర వాదనలు విన్న సుప్రీంకోర్టు విచారణకు ఇది సరైన సమయం కాదని కోర్టు తెలిసింది. గతంలో వేసిన పిటిషన్లకు భిన్నంగా ఇవి లేవని తెలిపింది. విభజనపై దాఖలైన 9 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌, పారిశ్రామిక వేత్త రఘురామకృష్ణంరాజు, మరో ఏడుగురు దాఖలు చేసిన అన్ని పిటిషన్లను కలిపి ఒకేసారి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇప్పుడున్న పరి/-థసితుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది. గతంలో కొట్టివేసిన పిటిషన్లకు ఇప్పటికీ తేడాలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. జ్టసిస్‌ దత్తు, జ్టసిస్‌ బాబ్డేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విభజన పిటిషన్లపై సుదీర్ఘవాదనలు వింది. దీంతో సుప్రీంను ఆశ్రయించయినా బిల్లును అడ్డుకుంటామన్న వారికి చుక్కెదురయ్యింది.
ఆర్టికల్‌ 3 పై స్పష్టత ఇవ్వాలన్న న్యాయవాదుల వాదనను సుప్రీంకోర్టు పట్టించుకోలేదు.రాష్ట్ర విభజనను నిలిపివేయాలని దాఖలైన 9 పిటిషన్లను సుప్రీంకోర్టు ఒకేసారి విచారణకు స్వీకరించిన నేపథ్యంలో పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాదులు నారిమన్‌, మోహన్‌లాల్‌ శర్మ వాదనలు వినిపించారు. ఆర్టికల్‌ 3ని ఇష్టానుసారం ఉపయోగిస్తే రాజ్యాంగ సమగ్రతకు అర్థం లేదని శర్మ వాదించారు. విభజనకు అసెంబ్లీ అంగీకరించకపోతే పరిస్థితి ఏమిటనే దానిపై కోర్టు స్పష్టత
ఇవ్వాలని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. రాష్ట్ర విభజనను నిలిపివేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని సీనియర్‌ న్యాయవాది నారిమన్‌ కోర్టుకు విన్నవించారు. ఆర్టికల్‌ 371 డి, ఇ ఉండగా ఆంధప్రదేశ్‌ రాష్టాన్న్రి ఎలా విభజిస్తారు? ఆర్టికల్‌ 3పై రాజ్యాంగ ధర్మాసనం స్పష్టత ఇవ్వాలని కోరారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను అనుసరించి తెలంగాణకు ప్రాంతీయ మండలి వేయాలని నారిమన్‌ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. పంజాబ్‌ విభజన సమయంలో అనేక కమిటీలు పనిచేశాయని, ఇప్పుడు మాత్రం కనీసం శ్రీకృష్ణ కమిటీ నివేదికను కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టలేదుని, బిల్లు చట్టం అయ్యాక చేయడానికి ఇంకేవిూ ఉండదని నారిమన్‌ వాదించారు. తక్షణమే విభజన స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. ఇక సమైక్య స్ఫూర్తి అనేది ప్రజాస్వామ్యానికి మూలమని మరో న్యాయవాది ఎంఎన్‌ రావు అన్నారు. అసెంబ్లీ అంగీకారం లేకుండా ఎక్కడా విభజన జరగలేదని, ఒకవేళ బిల్లును అసెంబ్లీ నిరాకరిస్తే రాష్టాన్న్రి ఏర్పరిచే హక్కు కేంద్రానికి ఉండదని వాదించారు. అసెంబ్లీకి వచ్చిన బిల్లులో అన్ని అంశాలు లేవని, అసలు విభజన ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాల్సిన హక్కు ప్రతి ఎమ్మెల్యేకూ ఉందని ఎంఎన్‌ రావు చెప్పారు. ఇలాంటి అంశాల్లో కూడా రహస్యం పాటించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
అసెంబ్లీలో సభ్యులకు వాదనలు వినిపించే హక్కుందని మరో న్యాయవాది పప్పు శ్యామల అన్నారు. రాష్ట్రపతి తెలంగాణ బిల్లును రికమండ్‌ చేయాలంటే ఆయన కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని, రాష్ట్రపతి ముందు సరైన సమాచారం ఉంటేనే అసెంబ్లీలో సభ్యులు తమ వాదనల్ని వినిపిస్తారని, అయితే ఈ బిల్లులో సమగ్ర సమాచారం లేదని పప్పు శ్యామల చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *