Wednesday, 4 November 2026

ఒడిశాలో పడవ ప్రమాదం

10 మంది మృతి
భువనేశ్వర్‌, ఫిబ్రవరి 9 (జనంసాక్షి) :
ఒడిశాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. సంబర్‌పూర్‌ జిల్లా తీతాపల్లి వద్ద మహానదిపై నిర్మించిన హీరాకుడ్‌ రిజర్వాయర్‌లో ఆదివారం పడవ మునిగింది. ఈ ప్రమాదంలో పది మంది మృతిచెందగా, మరో 30 మంది గల్లంతయ్యారు. చనిపోయిన వారి మృతదేహాలను ఆదివారం వెలికి తీశారు. లయన్స్‌ క్లబ్‌ సభ్యులు మూడు పడవల్లో ఆదివారం విహార యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గల్లంతయిన వారందరూ ఒడిశాకు చెందిన వారేనని సమాచారం. గల్లంతైన వారి కోసం రక్షణ దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. రాత్రి వరకూ సహాయక చర్యలు నిర్వహించి, చీకటి పడిన తర్వాత నిలిపివేశారు. కాగా మరో 30 మందిని సహాయక సిబ్బంది రక్షించి ఒడ్డుకు చేర్చారు. గల్లంతయిన వారిలో అత్యధికులు చిన్నారులే కావడంతో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశమున్నట్లు స్థానికులు చెప్పారు. వారు బతికే అవకాశాలు తక్కువేనని వారు పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *