
‘షరతులతో కూడిన మద్దతు’ నాడనలేదు
యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఫైర్
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (జనంసాక్షి) :
బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు తెలంగాణ ఏర్పాటు విషయంలో సీమాంధ్ర నాయకుడిగానే వ్యవహరిస్తున్నాడని, ఆ పార్టీ నాయకుడు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. జాతీయ నాయకుడిగా ఉన్న ఆయన ఒక ప్రాంతానికి దిగజారి మాట్లాడటం వల్ల తెలంగాణ ప్రాంతంలో బీజేపీకి తీరని నష్టం వాటిల్లుతుందని యెన్నం అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఇక్కడ వేయి మందికి పైగా విద్యార్థులు, యువత బలిదానాలు చేసుకున్నప్పుడు బీజేపీ తెలంగాణకు బేషరతుగా మద్దతిస్తున్నామని చెప్పిందని అన్నారు. లోక్‌సభలో పార్టీ పార్లమెంటరీ పక్షనేత సుష్మాసర్వాజ్ కూడా ఈ విషయాన్ని పలు పర్యాయాలు చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు షరతులతో కూడిన మద్దతిస్తామంటూ వెంకయ్య మాట్లాడటం సరికాదని, ఈ బిల్లును ఆమోదిస్తే సీమాంధ్రకు నష్టం జరుగుతుందంటూ ఆయన వ్యాఖ్యానించడం మంచిదికాదన్నారు. తెలంగాణకు వెంకయ్యనాయుడు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని యెన్నం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. వెంకయ్యనాయుడు సీమాంధ్ర నాయకుడిగా మాట్లాడుతున్నారా లేదా జాతీయ నాయకుడిగా సంప్రదింపులు జరుపుతున్నారా అనేది స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిండు పాలకుండలో విషం చుక్క వేయొద్దంటూ వెంకయ్యను విమర్శించారు. అయితే వెంకయ్య నాయుడుపై ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తెలిపారు. వెంకయ్యనాయుడు ఎన్నడూ తెలంగాణకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లు ముందుగా లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీల విశ్వసనీయతకు తెలంగాణ బిల్లు ఒక పరీక్ష అని ఆయన వ్యాఖ్యానించారు.
సీమాంధ్ర నాయకుడిగా వెంకయ్య




