
గందరగోళం మధ్య ప్రవేశపెట్టిన ‘ఆనం’
తెలంగాణ మంత్రులు కేబినెట్‌కు గైర్హాజర్
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను సోమవారం మొక్కుబడిగా ప్రవేశపెట్టారు. తెలంగాణ ప్రాంత సభ్యుల ఆందోళనల మధ్య ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర శాసనసభ చరిత్రలో అధికారపక్షమే బహిష్కరించిన ఓటాన్ బడ్జెట్ సమావేవాల్లో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం చేశారు. అధికార పక్ష సభ్యులు కేబినేట్ భేటీని కూడా బహిష్కరించి నిరసన తెలిపిన వేళ, ఎన్నికల సమయం కావడంతో ఓటాన్ బడ్జెట్ తప్పనిసరయ్యింది. తీవ్ర నిరసనలు, గందరగోళం మధ్య 2013-14 ఆర్థిక సంవత్సరానికి లక్ష 83.129 వేల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టే అర్హత లేదంటూ టీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేసింది. తెలంగాణ మంత్రులు కేబినేట్ బడ్జెట్ సమావేశానికి హాజరుకాలేదు. ఈ బడ్జెట్లో ప్రణాళికా వ్యయం 67,800 కోట్లు, ప్రణాళికేతర వ్యయం 1,15,500 కోట్లుగా పేర్కొన్నారు. సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసింది. అయితే తెలంగాణ మంత్రులు బడ్జెట్ కేబినేట్‌ను బహిష్కరించారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం సభ్యులు బడ్జెట్‌ను అధ్యయనం చేసేందుకు వీలుగా మంగళవారం శాసనసభకు సెలవు ప్రకటించారు. బుధవారం చర్చ అనంతరం గురువారం బడ్జెట్‌కు ఆమోదం లభించనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి వార్షిక ప్రణాళిక కింద 59,496 కోట్లు పొందుపరిచారు. దీనికి 66 కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి వచ్చే 8,304 కోట్లు కలపడంతో వార్షిక ప్రణాళిక వ్యయం 67,800 కోట్లకు చేరనుంది. మధ్యంతర భృతి, పెరిగే డీఏలను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రణాళికేతర వ్యయాన్ని 1,15,500 కోట్లుగా ప్రతిపాదించారు. ఎన్నికల కోసం బడ్జెట్లో 390 కోట్లు కేటాయిస్తున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే కావడంతో వ్యవసాయ బడ్జెట్, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బడ్జెట్లను పెట్టడం లేదు. వరుసగా నాలుగోసారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం ఆనందగా ఉందని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టాన్ని అమలులోకి తెచ్చామని, పరిపాలనపరంగా అత్యుత్తమ రాష్ట్రంగా ఇండియాటుడే పురస్కారం లభించిందన్నారు. 2014-15 వార్షిక బడ్జెట్ రూ.1,83,129 కోట్లుగా ఉందని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి వార్షిక ప్రణాళిక కింద 59, 496 కోట్లు పొందుపరిచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20,346 కొత్త ఉద్యోగాలు మంజూరు చేయడం జరిగిందని, 98,652 ఖాళీలను నేరుగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చిందన్నారు. ద్రవ్యలోటు అంచనా రూ.25,402 కోట్లు అని తెలిపారు. 2013-14లో సవరించిన బడ్జెట్ అంచనాలో రెవెన్యూ మిగులు రూ.1,023 కోట్లు అని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.13 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన 1.32 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20,346 ఉద్యోగాలు మంజూరు చేశామని అన్నారు. 98,652 ఖాళీలను నేరుగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. బ్జడెట్‌పై అధ్యయనానికి మంగళవారం ఉభయసభలకు సెలవు ఇచ్చారు. బుధ, గురువారాల్లో ఓటాన్ అకౌంట్ బ్జడెట్‌పై ఉభయసభల్లోనూ చర్చ జరగనుంది. శాసనసభలో ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మండలిలో మంత్రి రామచంద్రయ్య ఓటాన్ అకౌంట్ బ్జడెట్ ప్రవేశపెట్టారు. అనంతరం ఉభయసభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. ఓటాన్ అకౌంట్ బ్జడెట్‌పై బుధ, గురువారాల్లో ఉభయసభల్లో చర్చ జరుగుతుంది. అంతకుముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమైన మంత్రివర్గం బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసింది. ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకు వ్యయానికి సంబంధించి బడ్జెట్‌ను అసెంబ్లీకి సమర్పిస్తారు. సమావేశాల కోసం రాష్ట్ర అసెంబ్లీ సోమవారం నుంచి సమావేశం అయ్యింది. 13వ తేదీతో సమావేశాలు ముగుస్తున్నాయి. ఆతర్వాత సభ నిరవధికంగా వాయిదా పడుతుంది. మరోవైపు సీఎం కిరణ్ వైఖరికి నిరసనగా తెలంగాణ ప్రాంత మంత్రులు కేబినెట్ సమావేశానికి దూరంగా ఉన్నారు. అంతేకాకుండా వారు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. ఓటాన్ అకౌంట్ బ్జడెట్లో సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పెంచడంపై బొత్స మంత్రి వర్గ సమావేశంలో నిలదీశారు. ఇంతటి ఆర్థిక ప్రాధాన్యం ఉన్న అంశాన్ని కేబినెట్ దృష్టికి తీసుకరాకపోవడం దారుణమన్నారు. సీఎస్ కూడా ఈ అంశాన్ని మంత్రులకు తెలపకపోవడం గర్హనీయమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి తెలంగాణ ప్రాంత మంత్రులు రాకపోవడాన్ని బొత్స తప్పుబట్టారు. వాళ్లు ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి కూడా నష్టం కలిగిస్తున్నారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ వ్యయానికి అంచనాల పెంపును కూడా పీసీసీ చీఫ్ బొత్స తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు బడ్జెట్ విషయమై సోమవారం ఉదయం అసెంబ్లీ ఆవరణలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆయన తన నిరసన తెలియజేస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఒక లేఖ కూడా ఇచ్చారు. వాస్తవానికి సాగునీటి ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచడాన్ని గతంలోనే బొత్స సత్యనారాయణ వ్యతిరేకించారు. ఈమేరకు ఇంతకుముందు కూడా ఒకసారి ఆయన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు లేఖలు సైతం రాశారు.
కేబినెట్ భేటీని తెలంగాణ మంత్రులు బహిష్కరించారు. అంతకుముందు మంత్రి జానారెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సారయ్య, సుదర్శన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. అలాగే మంత్రివర్గ సమావేవానికి హాజరు కారాదని నిర్ణయించారు. తమకు వ్యతిరేకంగా సాగుతున్న అసెంబ్లీలో బడ్జెట్‌కు సహకరించివద్దని నిర్ణయించారని సమాచారం. శాసనసభలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి తెలంగాణ మంత్రులు హాజరు కాలేదు. హైదరాబాద్ బద్రర్స్‌గా పేరు పొందిన మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ అసెంబ్లీలో వుండి కూడా హాజరు కాకపోవడం గమనార్హం. తెలంగాణ అంశంలో ముఖ్యమంత్రి అనుసరిస్తున్న తీరు బాధాకరంగా ఉందని, అందుకే కేబినెట్ భేటీకి వెళ్లలేకపోతున్నామని తెలిపినట్లు తెలుస్తోంది. మేము తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిమి కాబట్టి టి.మంత్రులు చెప్పినట్లు చేస్తామని చెబుతూనే జానారెడ్డి ఇంట్లో టి. మంత్రుల కూడా వీరు హాజరు కాలేదు. కేబినెట్‌కు హాజరు కావాలా లేదా అనే దానిమీద టి.మంత్రులు చర్చలు జరిపాక హాజరు కాకూడదని నిర్ణయించారు. కాగా దిగ్విజయ్ సింగ్ మాత్రం ఫోన్ చేసి కేబినెట్‌కు హాజరై ప్రభుత్వానికి సహకరించాలని హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టడం ప్రభుత్వానికి కత్తిమీద సాములా తయారైంది. తరవాత శాసనసభ కమిటీ హాలులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి తెలంగాణ మంత్రులు హాజరుకాలేదు. హైదరాబాద్ బద్రర్స్‌గా పేరు పొందిన మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ అసెంబ్లీలో వుండి కూడా హాజరు కాకపోవడం గమనార్హం.
మొక్కుబడిగా ఓట్ ఆన్ అకౌంట్




