
నేటికి వాయిదా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (జనంసాక్షి) :
తెలంగాణ బిల్లుపై సీమాంధ్ర ఎంపీలు ఎప్పటి మాదిరిగానే మంగళవారమూ సభా కార్యక్రమాలకు అడ్డుతగిలారు. సీమాంధ్ర ఎంపీల నిరసనలు, నినాదాలు, ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు మంగళవారం దద్దరిల్లాయి. గత ఐదు రోజులుగా ఉభయసభలు ఎలాంటి కార్యక్రమాలుచేపట్టకుండానే వాయిదా పడుతున్నాయి. ఉభయ సభల్లోనూ సీమాంధ్ర ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి ప్లకార్డులతో తమ నిరసన తెలిపారు. దాంతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలగటంతో పార్లమెంట్‌లో వాయిదాల పర్వం కొనసాగింది. లోక్ సభ వాయిదా అనంతరం సమావేశాలు ప్రారంభం అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. సీమాంధ్ర ఎంపీలు వెల్లోకి దూసుకెెళ్లి నినాదాలతో ¬రెత్తించారు. సీమాంధ్ర ఎంపీలు కూడా తమ తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలిపారు. దీంతో లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగింది. ఈ దశలో లోక్‌సభను బుధవారనానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు. ప్రారంభంతోనే సీమాంధ్ర, తెలంగాణ సభ్యుల ఆందోళనల మధ్య సభ కొనసాగింది. దీంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్దపెట్టున నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. సభ్యుల ఆందోళన మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలు కొనసాగించారు. కేంద్ర ప్రభుత్వంపై కొనకళ్ల నారాయణ, లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు అందాయని, సభ అదుపులో లేనందున అవిశ్వాస నోటీసును చేపట్టలేకపోతున్నానని స్పీకర్ ప్రకటించారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలిపారు. సభ నిర్వహణకు సహకరించాలని స్పీకర్ కోరినా సభ్యులు పట్టించుకోకపోవడంతో లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వంపై ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు అందాయని, అయితే సభ అదుపులో లేనందున చర్చ చేపట్టలేకపోతున్నట్లు వెల్లడించారు. తీవ్ర గందరగోళం మధ్యే కొద్దిసేపు సమావేశాలను స్పీకర్ మీరాకుమార్ నడిపించినా.. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేశారు. అంతకు ముందు సభ ప్రారంభం కావటంతోనే సీమాంధ్ర ఎంపీలు పోడియం వద్దకు దూసుకు వెళ్లి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. మరోవైపు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సీమాంధ్ర ప్రాంత ఎంపీలు ఛైర్మన్ వెల్లోకి దూసుకు వెళ్లి నినాదాలు చేశారు. సీమాంధ్ర ఎంపీలకు అన్నా డీఎంకే, డీఎంకే ఎంపీలు మద్దతు తెలిపారు. అన్నాడీఎంకే ఎంపీ మైత్రేయన్‌తో కలిసి కాగితాలు చించి ఛైర్మన్‌పై విసిరివేశారు.రాజ్యసభలో కూడా సీమాంధ్ర సభ్యులు ఆందోళనను ఉద్ధృతం చేశారు. కె.వి.పి రాంచంద్రరావు, సీఎం రమేష్, సుజనాచౌరది తదితరులు చైర్మన్ పోడియం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపు తప్పటంతో ఛైర్మన్ హమీద్ అన్సారీ సభను తొలుత పది నిమిషాలు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైనా ప్రతిష్టంభన కొనసాగటంలో మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. మళ్లీ సభ ప్రారంభం అయినా సీమాంధ్ర ఎంపీలు తమ పట్టు వీడకపోవటంతో సమావేశాలు మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది.
ఉభయ సభల్లో అదే తీరు




