Wednesday, 4 November 2026

తెలంగాణకు కట్టుబడ్డాం

బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్‌ జవదేకర్‌
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని, ఈ విషయంలో తమ నిజాయితీని శంకించడానికి వీల్లేదని బీజేపీ ప్రతినిధి ప్రకాశ్‌ జావదేకర్‌ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన న్యూఢిల్లీలో మాట్లాడుతూ.. ఆంధప్రదేశ్‌ విభజన బిల్లు పార్లమెంట్లో ప్రవేశ పెట్టే విషయంలో కాంగ్రెస్‌ పార్టీ నిజాయితీగా వ్యవహారించడం లేదని ఆయన ఆరోపించారు. మంగళవారం రాజ్యసభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెడతామని ముందుగా కాంగ్రెస్‌ వెల్లడించింది. అయితే టి.బిల్లును పెట్టడం లేదని రాజ్యసభ ఛైర్మన్‌ ప్రకటించారని తెలిపారు. కానీ… కాంగ్రెస్‌ ఎంపీలే ఉభయసభలను అడ్డుకుంటున్నారన్నారు. సభ సమావేశాలకు అడ్డుపడుతున్న కాంగ్రెస్‌ ఎంపీలను సస్పెండ్‌ చేసి సభలో నుంచి బహిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అయితే ఇవేవిూ చేయకుండా కాంగ్రెస్‌ పార్టీ డబుల్‌ గేమ్‌ ఆడుతోందని ప్రకాశ్‌జవదేకర్‌ వెల్లడించారు.బిల్లుపై తెచ్చినట్లు ప్రయత్నాలు చేసి తెలంగాణ ప్రాంత ప్రజలను మభ్యపెడుతుందని ఎద్దేవా చేశారు. ఇరు సభలలోని స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి కేంద్రమంత్రులు నిరసనలు తెలుపుతున్న కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఉలుకుపలుకు లేకుండా కూర్చుందని ప్రకాశ్‌ జవదేవకర్‌ ఆరోపించారు. పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటున్న సీమాంధ్ర పార్లమెంటు సభ్యులను కాంగ్రెసు కట్టడి చేయలేకపోవడంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. తాము బిల్లుకు మద్దతు ఇస్తామని అంటూనే వివిధ షరతులు పెడుతోంది. అయితే, సొంత పార్టీ వాళ్లనే కట్టడి చేయలేరా, అవసరమైతే వాళ్లను సస్పెండ్‌ చేయండి అంటూ జవదేకర్‌ వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెసు పార్టీకి ఒక పరిష్కారం దొరికినట్లయింది. మొదట్లో సభ్యులపై చర్యలు తీసుకోవద్దన్న బీజేపీయే ఇప్పుడు మార్గం చూపించిందని సంతోషిస్తూ, ముందుగా పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. రేపో మాపో తెలంగాణ బిల్లును పార్లమెంటు-లో ప్రవేశపెట్టాల్సి వస్తే, అప్పుడు సీమాంధ్ర ఎంపీలు దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఎటూ చేస్తారు కాబట్టి, అప్పుడు సభ నుంచి కూడా వారిని సస్పెండ్‌ చేయించొచ్చని కాంగ్రెస్‌ పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *