
అరుపులు కేకల మధ్య రైల్వే ఓట్ ఆన్ అకౌంట్
72 కొత్త రైళ్లు.. పెరగని చార్జీలు
పది నిమిషాల్లో ప్రసంగం ముగించిన ఖార్గే
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 (జనంసాక్షి) :
ఎన్నికల వేళ ప్రజలపై ఎలాంటి భారం మోపకుండానే కేంద్ర ప్రభుత్వం రైల్వే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రైల్వే శాఖా మంత్రి మల్లికార్జున ఖర్గే తొలిసారిగా లోక్ సభలో మధ్యంతర రైల్వే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. సీమాంధ్ర ఎంపీల ఆందోళన మధ్యే ఖర్గే బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. వెల్‌లోకి దూసుకెళ్లిన సీమాంధ్ర ఎంపీలు నిరసన వ్యవక్తం చేస్తూ నినాదాలు చేశారు. అయినా మంత్రి ఖర్గే తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు. గందరగోళం మధ్య మధ్యంతర రైల్వేబడ్జెట్ మంత్రి ఖర్గే ప్రవేశపెట్టిన అనంతర సభ రేపటికి వాయిదా పడింది. అనంతరం సభ గురువారానికి వాయిదా పడింది. రైల్వేశాఖ మంత్రి మల్లిఖార్జున ఖర్గే బుధవారం లోక్ సభలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. తొలిసారిగా ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే సీమాంధ్ర ఎంపీల నిరసనల మధ్యే ఖర్గే తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు. సభ్యుల ఆందోళన కారణంగా రైల్వే బ్జడెట్‌ను సభకు సమర్పిస్తున్నట్లు ప్రకటించిన ఖర్గే తన ప్రసంగాన్ని అర్థాంతరంగా ముగించారు. సభ్యుల ఆందోళన కారణంగా కేవలం పది నిమిషాల్లోనే ఖర్గే తన ప్రసంగాన్ని ముగించాల్సి వచ్చింది. ఖర్గే ప్రసంగిస్తుండగానే సీమాంధ్ర సభ్యులు విభజన బిల్లు ప్రతులను చించి గాల్లో విసిరేశారు. గందరగోళం మధ్య స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. రైల్వేలను అనుసంధానం చేస్తామని, డబ్లింగ్, రైల్వేల ఆధునికీకరణకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన తన ప్రసంగంలో తెలిపారు. రైలు ప్రయాణికులకు సౌకర్యాలు, భద్రత మరింత మెరుగుపరచే దిశగా.. రైల్వే మంత్రి మల్లికార్జున్ ఖర్గే ఇప్పటికే కసరత్తు పూర్తీ చేశారు. యూపీఏ-2 ఇదే చివరి రైల్వే బడ్జెట్. 2009 ఓటాన్ అకౌంట్ రైల్వే బడ్జెట్‌లో.. రైల్వేమంత్రి లాలూప్రసాద్ యాదవ్ 2 శాతం రైలు టికెట్ ధర తగ్గించినట్టే.. ఇప్పుడుకూడా రైల్వే టికెట్ ధరలు కాసింతైనా తగ్గించేందుకు ఖర్గే ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో..ఛార్జీలు తగ్గించకపోయినా.. కొత్తగా రైలు ఛార్జీలు పెంచడంలేదని తెలుస్తోంది. ఖద్రా-వైష్ణోదేవి మార్గానికి రైలు మార్గం సిద్ధమైందని, రైల్వేను ఇంకా విస్తరణ చేయాలని ఖర్గే తెలిపారు. తూర్పు- దక్షిణ రైల్వేలో రెండు కొత్త గూడ్స్ రైల్వే లైన్లు వేస్తున్నట్లు పేర్కొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ఖద్రాక్ష- వైష్ణోదేవి మధ్య రైలు మార్గం ప్రారంభానికి సిద్ధమైందని తెలిపారు. తూర్పు-పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్‌కు కట్టుబడి ఉన్నామన్నారు. కాజీపేట, విజయవాడ మీదుగా సికింద్రాబాద్-విశాఖ ఎక్స్‌ప్రెస్, కాచిగూడ-తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్, గుంటూరు-కాచిగూడ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-గుల్బర్గా ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. చప్రా, రాయ్‌బరేలిలో కోచ్ ఫ్యాక్టరీలు త్వరలో ప్రారంభం కానుందన్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున్ ఖార్గే తొలిసారిగా లోక్‌సభలో రైల్వేఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ లోని ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి. కాజీపేట, విజయవాడ మీదుగా సికింద్రాబాద్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ కాచీగూడ -తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్, గుంటూరు-కాచీగూడ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్-గుల్బర్గాల మధ్య ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, ఖద్రా-వైష్ణోదేవి మధ్య ప్రారంభానికి సిద్ధమైన రైలు మార్గం, విస్తరణ, కొత్త పెట్టుబడులు రావటం అత్యవసరం అని పేర్కొన్నారు. తూర్పు-దక్షిణ రైల్వేలో రెండు ప్రత్యేక సరుకు రవాణా మార్గాలు ప్రారంభించనున్నట్లు ఖర్గే చెప్పారు. తూర్పు – పశ్చిమ రైల్వేలో రెండు ప్రత్యేక సరుకు రవాణా మార్గాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా రైళ్లను ప్రారంభిస్తామన్నారు. డబ్లింగ్, రైల్వేల అధునీకరణకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. కాశ్మీర్‌కు రైల్వేలైన్ పూర్తి కావడం గర్వకారణమని వెల్లడించారు. 11.2 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించి సత్తా చాటామని ఖర్గే సభకు చెప్పారు. 2702 కిలోవిూటర్ల మేర కొత్త రైల్వే లైన్లు ప్రతిపాదనలను వెల్లడించారు. 1532 కిలోవిూటర్ల డబ్లింగ్ పనులు పూర్తి చేశాం. పెండింగ్ ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేస్తామన్నారు. రాయ్‌బరేలిలో ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధం చేశామన్నారు. ప్రయాణికుల భద్రత కోసం కట్టు-దిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రమాదాల నివారణకు ప్రాధాన్యం ఇచ్చిమన్నారు. మరో 4 వేల 500 కిలోవిూటర్ల రైల్వే లైను విద్యుతీకరణ పూర్తి చేస్తామన్నారు. రైల్వే ప్రాజెక్టుల్లో వందశాతం ఎఫ్‌డీఐలకు అనుమతులు తీసుకుని వస్తామన్నారు. రూ. 2.25 వేల కోట్ల ఎఫ్‌డీఐలు వస్తాయని అంచనా వేశారు. అయితే ఓటాన్ అకౌంట్ కావడంతో రవాణా ఛార్జీల్లో మార్పులు ప్రకటించలేదు. ఎన్నికల దృష్ట్యా ప్రయాణికుల ఛార్జీల తగ్గింపు కూడా జరగలేదు. 35 రూట్లలో ప్రీమియం ప్రైసింగ్ -టైన్స్ ఇప్పటి వరకు 24 వేల కిలోవిూటర్ల విద్యుదీకరణ తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. కొత్తగా 2700 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ ప్రతిపాదనలు చేస్తున్నామని రైల్వేమంత్రి ప్రకటించారు. జమ్మూ-కాశ్మీర్ మధ్య మరిన్ని రైళ్లు నడిపే ప్రతిపాదన ఉందన్నారు. మొత్తానికి బుధవారం సీమాంధ్ర సభ్యుల ఆందోళనతో లోక్‌సభ దద్దరిల్లింది. వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర ఎంపీల ఆందోళన మధ్యే రైల్వేశాఖామంత్రి మల్లికార్జున ఖర్గే మధ్యంతర రైల్వే బ్జడెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. దీంతో సీమాంధ్ర సభ్యులు మరింత రెచ్చిపోయారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అందుకు ప్రతిగా తెలంగాణ సభ్యులు కూడా నినాదాలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎంపీలకు మద్దతుగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, చిరంజీవి, పళ్లంరాజు, పురందేశ్వరి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి వెల్‌లోకి వచ్చి నిరసన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. కిశోర్‌చంద్రదేవ్, కృపారాణి తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలిపారు. ఖర్గే రైల్వే బ్జడెట్ సమర్పిస్తుంటే రైల్వేశాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి వెల్‌లోకి వచ్చి నిరసన తెలపడం గమనార్హం. ఒక దశలో ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మందాజగన్నాథం మధ్య స్వల్పంగా తోపులాట జరిగింది. తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో సభలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.
ఎన్నికల వేళ




