
సీమాంధ్ర సమస్యలు పరిష్కరించమన్నాం
సవరణలు ప్రతిపాదించాం
తెలంగాణకు పూర్తి మద్దతు : భాజపా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 (జనంసాక్షి) :
పార్లమెంటులో తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రవేశ పెట్టాలో నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అది ఏ ఆంటకం లేకుండా సభ ఆమోదం పొందానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ భారతీయ జనతా పార్టీ అగ్రనేతలకు తన నివాసంలో విందు ఇచ్చారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతివ్వాలని కోరేందుకే ప్రధాని ఈ విందు ఏర్పాటు చేశారు. విందు అనంతరం కమల్ నాథ్ మాట్లాడుతూ.. తెలంగాణ ముసాయిదా బిల్లును పార్లమెంటులో ఎప్పుడు ప్రవేశ పెట్టాలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. తెలంగాణ బిల్లుకు బిజెపి సంపూర్ణ మద్దతు తెలిపిందని అన్నారు. అయితే తెలంగాణ బిల్లుతో పాటు తమకు సీమాంధ్ర సమస్యలు కూడా ముఖ్యమేనని బిజెపి నేతలు మరోమారు పునరుద్ఘాటించారని సమాచారం. ఇప్పటికీ ఇదే విషయాన్ని చెబుతున్నకమలనాథులు మరోమారు ఇదే విసయాన్ని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై పార్లమెంట్లో చర్చ జరగాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానితో విందు సమావేశంలో పాల్గొన్న బీజేపీ అగ్రనేతలు టీ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటిట్తూనే సీమాంధ్రకు న్యాయం చేయాలని పలు సూచనలు చేసినట్లు సమాచారం. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, కొత్త రాజధానిని వెంటనే ప్రకటించాలని ప్రధానితో బీజేపీ నేతలు తేల్చిచెప్పినట్లు సమాచారం. మీ మంత్రుల్ని, ఎంపీలను అదుపులో ఉంచుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని వారు ప్రధానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశమై బీజేపీ సవరణలపై కసరత్తు చేయనున్నట్లు సమాచారం.. అయితే తెలంగాణ బిల్లు పాస్ అవుతుందని కమల్‌నాథ్ ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు లోకసభలో, రాజ్యసభలో తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము మొదటి నుండి కట్టుబడి ఉన్నామని, హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణకు తాము మద్దతిస్తామని అదే సమయంలో సీమాంధ్ర ప్రాంత ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించాలని కోరారు. బిల్లుకు మద్దతిచ్చే విషయంలో తాము వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. ఈ విందులో లాల్ కృష్ణ అద్వానీ, సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ, కేంద్రమంత్రులు చిదంబరం, కమల్ నాథ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, గురువారం లోకసభలో తెలంగాణ బిల్లు పెట్టనున్న విషయం తెలిసిందే. తెలంగాణ బిల్లుకు మద్దతిస్తామని చెప్పిన బిజెపి నేతలు ముందు విూ ఇల్లు చక్కబెట్టుకోవాలని భేటీ-లో సూచించారని సయమాచారం. కేంద్రమంత్రులు కూడా వెల్‌లోకి వస్తున్నారని, తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టే సమయంలో సభలో ఎలాంటి నినాదాలు లేకుండా చూడాలన్నారు. సీమాంధ్రుల సమస్యలు పరిష్కరించి బిల్లు పెట్టాలని కోరారు. కాగా, సాయంత్రం తెలంగాణ బిల్లుపై కేబినెట్ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముంది. ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధానికి వారు హామీ ఇచ్చారు. తెలంగాణ బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని విందుకు హాజరైన కేంద్ర మంత్రి కమల్‌నాథ్ స్ఫష్టం చేశారు. పార్లమెంటులో బిల్లు ఎప్పుడు ప్రవేశ పెట్టాల అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదని ఆయన చెప్పారు.
ఎట్టకేలకు.. ప్రధాని విందుకు భాజపా అగ్రనేతలు




