Wednesday, 4 November 2026

ఇక్కడా అంతే..

ఓట్‌ ఆన్‌ అకౌంట్‌కు అసెంబ్లీ ఆమోదం
హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 (జనంసాక్షి) :
పార్లమెంట్‌లో ఎలాంటి గందరోగళం పరిస్థితి నెలకొందో రాష్ట్ర శాసనసభలోనూ అలాంటి సీనే దర్శనమిచ్చింది. తీవ్రగందరగోళం మధ్య ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆమోదించిన అనంతరం శాసనసభ వాయిదా పడింది. సోమవారం సభ ప్రారంభం కాగానే ఇరు ప్రాంతాల ప్రతినిధులు సమైక్య, తెలంగాణ నినాదాలు చేశారు. దీంతో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అసెంబ్లీని గంట సేపు వాయిదా వేశారు. అనంతరం తిరిగి శాసనసభ ప్రారంభమైన వెంటనే సభ్యుల ఆందోళనల మధ్యే ఓటాన్‌ అకౌంట్‌ బ్జడెట్‌ను సభ ఆమోదించింది. ఆర్థికమంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ప్రసంగిస్తుండగానే ఇరు ప్రాంతాల సభ్యులు ఆందోళన, నినాదాలతో ¬రెత్తించారు. అనంతరం స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ సభను మంగళవారానికి వాయిదా వేశారు. తొలుత వాయిదా అనంతరం సభ మొదలైన వెంటనే ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి వివిధ ప్రభుత్వ బిల్లులను ప్రవేశ పెట్టారు. సమైక్య, తెలంగాణ నినాదాలతో సభ మార్మోగింది. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ను గందరగోళం మధ్య సభ ఆమోదం తెలిపింది. బిల్లులు సభ ఆమోదం పొందగానే సభాపతి రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సీఎం చాంబర్‌ కు నేతలు క్యూ కట్టారు. సీఎం రేపు రాజీనామా చేస్తారన్న వార్తల నేపథ్యంలో ఫైళ్ల పై సంతకాలు చేయించుకునే పనిలో పడ్డట్లు సమాచారం. అంతకు ముందు విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తిరస్కరించారు. బుధవారం ప్రారంభమైన అసెంబ్లీ కొద్దిసేపటికే వాయిదా పడింది. సభ్యులు ఆందోళన చేయడంతో స్పీకర్‌ గంట పాటు సభను వాయిదా వేశారు. ఆంధప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ బిల్లుపై తెలంగాణ, సీమాంధ్ర సభ్యులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన అనంతరం సభను బుధవారానికి వాయిదా వేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ను వాయిదా వేయాలని టీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. విభజన సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తాము బడ్జెట్‌ ప్రవేశ పెట్టుకుంటామని అన్నారు. బడ్జెట్‌ వాయిదా వేయాలని అందుకే కోరుతున్నట్లు టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటిఆర్‌ డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *