Wednesday, 4 November 2026

గవర్నర్‌ కోటాలో ముగ్గురు ఎమ్మెల్సీలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 (జనంసాక్షి) :
గవర్నర్‌ కోటాలో ముగ్గురు సీనియర్‌ నేతలను కాంగ్రెస్‌ పార్టీ శాసనమండలికి ఎంపిక చేసింది. పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ కంతేటి సత్యనారాయణ రాజు, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య, మాజీ ఎమ్మెల్యే రత్నాబాయిని శాసనమండలికి నామినేట్‌ చేస్తూ గవర్నర్‌ నరసింహన్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఉత్తర్వులతో మండలి ఏర్పాటు నుంచి ఎమ్మెల్సీ సీటును ఆశిస్తున్న సత్యనారాయణ రాజుకు అవకాశం దక్కింది. శాసన మండలి పునరుద్ధరణకు రాజు అప్పట్లో విశేష కృషి చేశారు. మండలి పునరుద్ధరణ జరిగి దాదాపు ఏడేళ్లయినా ఆయనకు అవకాశం రాలేదు. ఇప్పుడు ఆయనకు అవకాశం వచ్చింది. రాజ్యసభలో కెవిపి, సుబ్బరామిరెడ్డిలకు అవకాశం ఇవ్వడంతో బలహీనవర్గాలవారికి అవకాశం ఇవ్వరా అన్న విమర్శ వచ్చింది. దానికి సమాధానంగా నంది ఎల్లయ్య, రత్నాబాయిలకు అవకాశం ఇచ్చారు. నంది ఎల్లయ్య గతంలో ఐదుసార్లు లోక్‌సభకు, రెండుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. రత్నాబాయి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. ఈ రకంగా కంతేటి చిరకాలవాంఛ తిరింది. ఇక మరో సీటుకు ఎవరిని నామినేట్‌ చేస్తారన్నది సస్పెన్స్‌గానే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *