
నా గుండె రక్తమోడుతోంది
సభ్యుల ప్రవర్తనపై ప్రధాని దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 (జనంసాక్షి) :
పార్లమెంట్‌లో సభ్యులు ఎల్‌కేజీ పిల్లల మాదిరిగా ఒకరిపైకి ఒకరు దూసుకువచ్చి కొట్టుకున్నంత పనిచేశారు. సభ్యుల తీరుతో ప్రధాని మన్మోహన్‌సింగ్ కలత చెందారు. పార్లమెంటులో జరిగిన తాజా సంఘటనలపై ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి మంచి చేయవన్నారు. పార్లమెంట్ ఉభయసభల్లో సీమాంధ్ర ఎంపీలు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేశారు. సభలను సక్రమంగా నిర్వహించకుండా అడ్డుపడ్డారు. రాష్ట్ర విభజన అంశంతో లోక్‌సభ రగిలిపోయింది. సీమాంధ్ర ఎంపీల ఆందోళనలతో దద్దరిల్లింది. నలుగురు సీమాంధ్ర కేంద్రమంత్రులు కూడా పోడియం వద్దకు వెళ్లారు. తెలంగాణ, సీమాంధ్ర ఎంపీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ప్రధాని ఎంపీల వద్ద తన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. లోక్‌సభలో సమైక్యాంధ్ర ఆందోళనల మధ్యే రైల్వేమంత్రి ఖర్గే ఓటాన్ అకౌంట్ రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన బడ్జెట్ను చదివి వినిపించే సమయంలో సభ్యులు తీవ్రస్థాయిలో ఆందోళన చేశారు. దాంతో ఆయన తన ప్రసంగాన్ని అర్ధంతరంగానే ముగించారు. అరుపులు, కేకలు మధ్యలో బడ్జెట్ను తాను చదివినట్లుగానే భావించమని మంత్రి కోరారు. పార్లమెంటులో ఈరోజు చోటు చేసుకున్న సంఘటనలు తనకు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయని ప్రధాని అన్నారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచిదికాదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి వాటివల్ల మంచి జరుగుతుందనుకోవడం లేదన్నారు.
ఎల్‌కేజీ స్టూడెంట్లు




