Wednesday, 4 November 2026

చట్టసభలో సీమాంధ్రుల చిల్లర వ్యవహారం

లగడపాటి లత్కోరు వేషం
పెప్పర్‌ స్ప్రేతో ముష్కరునిలా రెచ్చిపోయిన జగడపాటి
కత్తులతో మోదుగుల
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం తలదించుకున్న రోజు
వీధి రౌడీల్లా లా మేకర్స్‌ జోకర్స్‌గా మారారు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 (జనంసాక్షి) :
పార్లమెంట్‌ సాక్షిగా సీమాంధ్రులు చిల్లర వేషాలతో చట్టసభలకే తీరని అవమానాన్ని మిగిల్చారు. లగడపాటి రాజగోపాల్‌ తన లత్కోరు వేషాలతో సభలో వీరంగం సృష్టించాడు. పెప్పర్‌ స్ప్రేతో ముష్కరునిలా రెచ్చిపోయి స్పీకర్‌ మీరాకుమార్‌తో పాటు తోటి సభ్యులపై దాడికి పాల్పడ్డాడు. టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి కత్తులతో రెచ్చిపోయాడు. వీధి రౌడీలో తోటి సభ్యులపై హత్య చేసేందుకు కూడా వెనుకాడలేదు. లోక్‌సభలో గురువారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రాంత ఎంపీలు స్థాయిని మరిచి రెచ్చిపోయారు. సభా మర్యాదకు భంగం కల్పించారు. సీమాంధ్ర ఎంపీల వికృత చేష్టలతో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ సిగ్గుతో తలదించుకుంది. పార్లమెంట్‌ చరిత్రలోనే గురువారం దుర్దినంగా మిగిలిపోయింది. తెలంగాణపై 60 ఏళ్ల అహంకార పూరిత పెత్తనం జడలు విప్పింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ వచ్చిన సీమాంధ్ర పెత్తందార్లు తమ వికృత రూపాన్ని ప్రదర్శించారు. ఇంతకాలం తమ పెత్తనంతో తెలంగాణను అణచివేతతో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన సీమాంధ్ర పెత్తనం వికటాట్టహాసం చేసింది. ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది. బలవంతగా కలుపుకున్న తెలంగాణను విడగొట్టి మళ్లీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రసజాస్వామ్య యుతంగా చేపట్టిన ప్రక్రియన దౌర్జన్యంతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. తీవ్రగందరగోళ పరిస్థితులు, సీమాంధ్ర ఎంపీల దౌర్జన్యకాండ మధ్యన లోక్‌సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును కేంద్ర ¬ంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ప్రవేశపెట్టారు. స్పీకర్‌ మీరాకుమార్‌ మాట్లాడుతూ ¬ంమంత్రి తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టారని ప్రకటించారు. ఎంపీలకు పరిస్థితి అర్థమయ్యే లోపు స్పీకర్‌ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే బిల్లు ప్రవేశ పెట్టినా ఎంత దౌర్జన్యం జరగాలో అంతా జరిగింది. ప్రజలతో ఎన్నికైన నేతలు వీధిరౌడీలకన్నా అధ్వాన్నంగా ప్రవర్తించారు. దేవాలయం లాంటి పార్లమెంటులో ముష్కరకాండ నిర్వహించారు. గతకొన్ని రోజులుగా చేస్తున్న ప్రకటనలకు అద్దం పెట్టారు. ఎంతకైనా తెగిస్తామని చెప్పినట్లుగానే చేశారు. లోక్‌సభలో కాగితాలు చించి విసిరివేస్తూ పైశాచికానందం పొందారు. టేబుళ్లు ఎక్కి మైకులు విరగ్గొట్టారు. నీటిగ్లాసులు పగుల గొట్టారు. టేబుల్‌పై ఉన్న అద్దాలను పగులగొట్టారు. సెక్రటరీ జనరల్‌ టేబుల్‌ ఎక్కి విలయతాండవం చేస్తూ అక్కడే ఉన్న కంప్యూటర్‌ను పగుల గొట్టారు. అడ్డం వచ్చిన ఇతర ఎంపీలను తోసేసి రౌడీయిజాన్ని ప్రదర్శించారు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే వారు చేసిన దానికి మాటలే రావు. రాయడానికి పదాలే ఉండవు. బిల్లు ప్రవేశ పెడతారని తెలిసినందున దానిని అడ్డుకునేందుకు సీమాంధ్ర ఎంపీలు దౌర్జన్యకాండకు దిగారు. కత్తితో పాటు. పెప్పర్‌ స్ప్రేతో దాడి చేసి తోటి ఎంపీలను గాయపరచారు. దేశ చరిత్రలో ఎన్నడూ జరగని ఘటన పార్లమెంటులో చోటు చేసుకుంది. ఎంపీలు తమ వీధి రౌడీయిజాన్ని పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. ప్రధానంగా సీమాంధ్రకు చెందిన విజయవాడ ఎంపీ లగడపాటి, టీడీపీ ఎంపి మోదుగుల వేణుగోపాలరెడ్డి రౌడీలకన్నా హీనంగా ప్రవర్తించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి సీమాంధ్ర ఎంపీలు అత్యంత నీచానికి దిగజారి ప్రవర్తించడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మోదుగుల కత్తితో దాడి చేస్తే, లగడపాటి పెప్పర్‌ స్ప్రే చల్లి ఎంపీలను భయభ్రాంతులకు గురిచేసి పారిపోయేలా చేశారు. యావత్‌ దేశం సిగ్గుతో తలదించుకునేలా సీమాంధ్ర సభ్యులు వ్యవహరించారు. పార్లమెంటులో వీధిరౌడీల్లా దౌర్జన్యానికి పాల్పడ్డారు. పెప్పెర్‌ స్పెల్రు ప్రయోగించారు. మైకులు విరగ్గొట్టి తెలంగాణ ఎంపీలపై దాడికి పాల్పడ్డారు. లగడపాటి రాజగోపాల్‌ ఏకంగా స్పీకర్‌పైనే పెప్పర్‌ స్పే కొట్టారు. టియర్‌ గ్యాస్‌ సభలో ప్రయోగించడంతో ఎంపీలందరూ భయంతో బయటికి పరుగులు తీశారు. సభలో గ్యాస్‌ ప్రయోగించడంతో చాలామంది ఎంపీలు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. లగడపాటిని అదుపుచేయడానికి ప్రయత్నించిన తెలంగాణ ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, మందా జగన్నాథంతో పాటు ఇతర ఎంపీలపై దగ్గర్నుంచి పెప్పర్‌ స్ప్రే ప్రయోగించడంతో వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని అంబులెన్స్‌లో అసుపత్రికి తరలించారు. సభలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన సభ్యలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణవాదులు డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌ భద్రతా సిబ్బంది సభ సీసీ పుటేజీలను పరిశీలించి లగడపాటిని తమ అదుపులో ఉంచుకున్నారు. పార్లమెంట్‌ సభ్యుడు వినుపాండే అస్వస్థతకు గురి కావడంతో అతన్ని పార్లమెంట్‌ ఆవరణలోని ఆసుపత్రికి తరలించారు. మైకులు విరగొట్టి కత్తితో పొడుచుకోవడానికి ప్రయత్నించిన ఎంపీ మోదుగులపై కూడా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేవారు. మోదుగుల కత్తి తీసుకువచ్చాడని పార్లమెంట్‌ భద్రతా సిబ్బంది నిర్ధారించారు. మరోవైపు తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై స్పీకర్‌ కార్యాలయం దృష్టిసారించింది. గందరగోళం మధ్య లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడటంతో సిబ్బంది లోక్‌సభను ఖాళీ చేయించారు. ఘర్షణ సందర్భంగా చెల్లాచెదురైన ఫర్నిచర్‌ను సరి చేస్తున్నారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ టేబుల్‌పై ఉన్న కంప్యూటర్‌ దెబ్బతిన్నట్లు సిబ్బంది గుర్తించారు. ఇదిలావుంటే పార్లమెంట్‌ వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆంధప్రదేశ్‌ పునర్‌వ్యవ్థసీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. పార్లమెంట్‌ ప్రవేశద్వారం వద్దకు చేరకున్న తెలుగుదేశం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు బలవంతంగా పంపించి వేశారు. మాజీ ఎంపీలు, ప్రజాప్రతినిధులను కూడా పోలీసులు తరిమికొట్టడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పలువురు ఆందోళనకారులను పోలీసులు ఈడ్చుకెళ్లారు. ఎంపీలు, మీడియా ప్రతినిధులు మినహా మిగిలినవారిని పార్లమెంట్‌ ఆవరణలోకి అనుమతించలేదు. రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్నారన్న సమాచారం తెలుసుకున్న సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆందోళనకారులు పెద్ద ఎత్తున పార్లమెంట్‌ వద్దకు తరలివచ్చారు. దీంతో ఆందోళనకారులను అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది.
పెప్పర్‌ స్ప్రేతో లగడపాటి చిల్లరవేషం
గతంలో ఓ మారు విజయవాడ నుంచి మాయమై హైదరాబాద్‌ నిమ్స్‌ వద్ద తేలిన ఎంపి లగడపాటి గురువారం తన అతి తెలివిని ఉపయోగించారు. నిషేధిత వస్తువులను లోక్‌సబలోకి తీసుకుని వచ్చారు. ఆంధప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ బిల్లును లోక్‌ సభలో ప్రవేశ పెడుతున్న సందర్భంలో సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు రెచ్చిపోయారు. ఎంపీ లగడపాటి ఒక అడుగు ముందుకేసీ స్పీకర్‌ పై పెప్పర్‌ స్ప్రే చేసే ప్రయత్నం చేశారు. దీనితో సభలో ఘాటైన వాసన రావడంతో పలువురు ఎంపీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో ఉత్తరప్రదేశ్‌ ఇద్దరు ఎంపీలున్నట్లు తెలుస్తోంది. వెంటనే అక్కడకు చేరుకున్న తెలంగాణ ప్రజాప్రతినిధులు లగడపాటిని అడ్డుకునే ప్రయత్నం చేయబోగా వారిపైకి స్ప్రే చేసినట్లు తెలుస్తోంది. లగడపాటి స్ప్రే చేయడంతో తాము దానిని ఎలా ఎదుర్కొవాలో అలానే ఎదుర్కొన్నామని టిడిపి ఎంపీ రమేష్‌ రాథోడ్‌ పేర్కొన్నారు. దాడి చేశారన్నా దానికి తగిన విధంగా బుద్ధి చెప్పామని, స్పీకర్‌ కు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఎంపీలను హత్య చేయడానికి లగడపాటి ప్రయత్నించారని తెలిపారు. అయితే మోదుగులపై దాడి చేస్తుంటే ఆత్మరక్షణార్థం లగడపాటి స్ప్రే చేశారని ఎంపీ హర్షకుమార్‌ పేర్కొన్నారు. అనంతరం లగడపాటి సృహ తప్పి పడిపోయారని అన్నారు.అయితే లడగపాటి, పొన్నంలతో పాటు మరొక ఎంపీని ఆస్పత్రికి తరలించారు. ఇదిలావుంటే సీమాంధ్ర రౌడీ ఎంపీలు సష్టించిన రణరంగం వల్ల లోక్‌సభలో ఫర్నిచర్‌ చెల్లాచెదురైంది. సైకో లగడపాటి, మోదుగుల విపరీత చర్యలతో లోక్‌సభ రణరంగాన్ని తలిపించింది. ఈ గందరగోళం మధ్యనే లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సిబ్బంది సభలో చెల్లాచెదరైన ఫర్నిచర్‌ను సరి చేస్తున్నారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఉన్న కంప్యూటర్‌ ముక్కలు మక్కలైనట్లు సిబ్బంది గుర్తించారు. పెప్పర్‌ స్ప్రే వల్ల అస్వస్థతకు గురైన ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, మందా జగన్నాథంలను రామ్‌ మనోహర్‌లోహియా ఆస్పత్రికి తరలించారు. సభ్యుల ఆందోళనల సందర్భంగా పార్లమెంట్‌ హాల్‌లో పడిపోయిన టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆ తర్వాత గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు మొదట రామ్‌ మనోహర్‌లోహియా ఆస్పత్రిలో చికిత్స అందించి అక్కడి నుంచి అప్పోలో ఆస్పత్రికి తరలించారు. చట్టాలను రూపొందించే పార్లమెంట్‌ సభ్యులు తమ వికృత చేష్టలతో జోకర్లలా మారారు. మరోవైపు రాజ్యసభలోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ చైర్మన్‌ పోడియం వద్దకు దూసుకుపోయి మైక్‌ విరిచారు. లోక్‌సభలోనూ స్పీకర్‌ మైక్‌లాగి పడేసేందుకు దూసుకువచ్చారు. స్పీకర్‌ పైకి స్ప్రే విసిరిన సమయంలో కొందరు ఎంపీలు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆమెకు రక్షణగా నిలిచారు. లేకుంటే ఘోరం జరిగిపోయేది. లోక్‌సభలో కేంద్ర ¬ంమంత్రి తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టగానే సీమాంధ్ర ఎంపీలు ముందుగా చేసుకున్న ప్లాన్‌ ప్రకారం పెప్పర్‌ స్ప్రే ప్రయోగించారు. మొదట స్పీకర్‌ మీరాకుమార్‌పై స్ప్రే కొట్టడానికి లగడపాటి రాజగోపాల్‌ ప్రయత్నించారు. దీన్ని గమనించిన తెలంగాణ ఎంపీలు స్పీకర్‌కు రక్షణగా నిలించారు. టీ ఎంపీలతో పాటు ఎంపీ అజారుద్దీన్‌ కూడా లగడపాటిని అడ్డుకున్నారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. లేనిచో పెప్పర్‌ గ్యాస్‌ వల్ల స్పీకర్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యేవారు.
16 మంది సభ్యుల సస్పెన్షన్‌
లోక్‌సభలో గందరగోళానికి కారణమైన పదహారు మంది సభ్యులను సస్పెండ్‌ చేస్తున్నట్టు స్పీకర్‌ మీరాకుమార్‌ ప్రకటించారు. వాయిదా అనంతరం లోక్‌సభ మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభమయ్యింది. ఇందులో ఉదయం గందరగోళానికి కారణమైన సభ్యులను సస్పెన్షన్‌ చేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్‌. అనంతరం సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదావేశారు. సమావేశాలు ముగిసేవరకు సభ్యులను సెక్షన్‌ 374(ఎ) ప్రకారం సస్పెండ్‌ చేసినట్లు స్పీకర్‌ పేర్కొన్నారు. సస్పెండైన వారిలో 14 మంది సీమాంధ్ర, ఇద్దరు తెలంగాణ సభ్యులను స్పీకర్‌ సభనుంచి సస్పెండ్‌ చేశారు. సీమాంధ్ర సభ్యులల్లో ఎస్పీవై రెడ్డి, మాగుంట, ఉండవల్లి, సాయిప్రతాప్‌, అనంత వెంకట్రామిరెడ్డి, రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్‌, సబ్బం హరి (కాంగ్రెస్‌), కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్‌, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి(టిడిపి), జగన్‌, మేకపాటి (వైకాపా) ఉన్నారు. తెలంగాణ సభ్యులల్లో గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్‌) ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *