Wednesday, 4 November 2026

సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాం

భాజపా ముసుగు తొలగింది : కమల్‌నాథ్‌
న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లును సభలో ప్రవేశపెట్టామని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కమల్‌నాథ్‌ తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ ముసుగు తొలగిపోయిందని, తెలంగాణ బిల్లుపై ఆ పార్టీది ద్వంద్వ వైఖరి అని ఆయన మండిపడ్డారు. తన 33 ఏళ్ల రాజకీయ జీవితంలో సభలో ఇటువంటి చర్యను నేను ఎన్నడూ చూడలేదని ఈ ఘటనలో ఏ పార్టీ ఎంపీలున్నా వారిపై చర్యలు తీసుకొనడం జరుగుతుందని, స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఆందోళనలు చేయడం సహజమే కాని ఈ విధంగా చేయడం సరికాదని, తన 33 సంవత్సరాల కాలంలో ఎన్నడూ ఇలాంటి ఘటన చూడలేదని తెలిపారు. కమల్‌నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ.. సభా సంప్రాదాయాలను మంటగలుపుతూ సీమాంధ్ర ఎంపీలు నేడు సభలో ప్రవర్తించిన తీరు సిగ్గుమాలిన చర్యగా పేర్కొన్నారు. తెలంగాణ బిల్లు లోక్‌సభలో అయిన సందర్భంలో సభలో దౌర్జన్యం చేసిన సీమాంధ్ర ఎంపీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్‌కు నివేదించనున్నట్లు కమల్‌నాథ్‌ తెలిపారు. సీమాంధ్ర ఎంపీలు పెప్పర్‌ (మిరియాలస్పే, కత్తులు, టియర్‌గ్యాస్‌తో సభలోకి వచ్చినట్టుగా సమాచారం ఉందన్నారు. వీరిపై చర్యలకు సిఫార్సు చేస్తున్నట్లు పేర్కొన్నారు. లోక్‌సభలో ఆంధప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భంలో చోటు చేసుకున్న పరిణామాలు ప్రజాస్వామ్యానికి కళంకమని పేర్కొన్నారు. బుధవారం లోక్‌సభలో తెలంగాణ ముసాయిదా బిల్లును షిండే ప్రవేశ పెట్టిన అనంతరం కాంగ్రెస్‌ బహిష్క్రృత నేత లగడపాటి పెప్పర్‌ స్ప్రే చేయడంతో పలువురు ఎంపీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు తాము, కొందరు సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. సభ్యులను తనిఖీ చేయడం నిబంధనలకు విరుద్ధమని, దానితో సభ్యులు వివిధ వస్తువులతో సభలోకి ప్రవేశించినట్లు తెలుస్తోందన్నారు. కేవలం 25మంది పూర్తి సభను నియంత్రించడం సబబు కాదని, సభలో జరిగిన పరిణామాలపై స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటారని కమల్‌నాథ్‌ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో భారతీయ జనత పార్టీ ముసుగు తొలగిందని, తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా ఆ పార్టీ వ్యవహరిస్తోందని తేలిపోయిందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్‌ ఆరోపించారు. తెలంగాణ బల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాం.. కావాలంటే సీసీ టీవీ ఫుటేజ్‌, పార్లమెంటు రికార్డులు చూసుకోవచ్చని ఆయనన్నారు. బీజేపీ సహకరించకున్నా విభజన బిల్లును ఆమోదింపచేస్తామని ఆయన స్పస్టం చేశారు. పార్లమెంట్‌లో టీ బిల్లు ప్రవేశపెట్టలేదని బీజేపీ వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుపట్టారు. అవసరమైతే సీసీ టీవీ పుటేజ్‌ చూసుకోవచ్చు అన్నారు. దీంతో బీజేపీ తెలంగాణకు వ్యతిరేకమని స్పష్టమైందన్నారు. బీజేపీ రెండు నాల్కల ధోరణి నేటితో బయటపడిందన్నారు. అయితే లోక్‌సభలో జరిగిన ఘటనలకు కాంగ్రెస్సే బాధ్యత వహించాలని ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్‌ డిమాండ్‌ చేశారు. సభలో స్పీకర్‌ రావడానికి ఒక నిమిషం ముందునుంచే గొడవ మొదలైందన్నారు. దీంతో సభలో అసలేం జరిగిందో అర్థం కాలేదని సుష్మా పేర్కొన్నారు. అసలు బిల్లు ప్రవేశ పెట్టలేదని అన్నారు. దీనిని తాము పరిగణించడం లేదన్నారు. మరోవైపు సీమాంధ్ర సభ్యుల తీరు అభ్యంతరకంగా ఉందన్నారు. పార్టీ అధినేత్రి ముందే సభ్యులు రెచ్చిపోవడం దారుణమన్నారు. సొంతపార్టీ ఎంపీలనే అదుపులో పెట్టుకోలేకపోయిందని ఆమె కాంగ్రెస్‌ను విమర్శించారు. లోక్‌సభలో టీ బిల్లు అనుబంధ ఎజెండాగా ప్రవేశపెట్టే విషయంపై తమకు సమాచారం లేదని ఆమె పేర్కొన్నారు. సీమాంధ్ర ఎంపీల ప్రవర్తన ప్రజాస్వామ్యనికి గొడ్డలిపెట్టు లాంటిదని సుష్మాస్వరాజ్‌ అభిప్రాయపడ్డారు. ఇక బిల్లుపై ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు ఉండవన్నారు. ఈ వ్యాఖ్యలపై కమలనాథ్‌ మండిపడ్డారు. తెలంగాణ విషయంలో భారతీయ జనతా పార్టీ డబుల్‌ గేమ్‌ ఆడుతోందని మంత్రి కమల్‌ నాథ్‌ విమర్శించారు. తెలంగాణ బిల్లు లోక్‌ సభలో ప్రవేశపెట్టిన తరుణంలో బీజేపీ వైఖరిలో మార్పు రావడం దురదృష్టకరమన్నారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకిగా మారిందని విమర్శించారు. బిజెపి తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్నారు. ఏది ఏమైనా పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా ప్రయత్నిస్తామని చెప్పారు. నేటి ఘటనలతో బీజేపీ తెలంగాణకు వ్యతిరేకమని తేలిపోయిందన్నారు.బీజేపీ రెండు నాల్కల ధోరణి నేటితో బయటపడిందన్నారు. తెలంగాణకు వ్యతిరేకం కాదంటునే కుట్రలతో టీ బిల్లుకు అడ్డుపడే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు.
ఎంపీలపై చర్య తప్పదు: దిగ్విజయ్‌
లోక్‌సభను అడ్డుకునేందుకు సీమాంధ్ర ఎంపీలు చేసిన దుశ్చర్య హేయమని, ఆ ఘటన పార్లమెంటు చరిత్రలోనే దుర్ధినమని ఆంధప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో సీమాంధ్ర ఎంపీలు వ్యవహరించిన తీరు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అనుచితంగా ప్రవర్తించిన ఎంపీలపై లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ ఛైర్మన్‌ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. లోక్‌సభలో స్పీకర్‌ మీరాకుమార్‌ తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టారని తెలిపారు. బిల్లుపై సమగ్ర చర్చ జరుగుతుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. బిల్లు పెట్టాక పెట్టలేదనడం బిజెపికే చెల్లిందన్నారు. ఆ పార్టీ తెలంగాణపై తన వైకరిని మార్చుకున్నట్లుగా ఉందన్నారు. పార్లమెంటు చరిత్రలో ఈ రోజు దుర్దినమని దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. సభలో అలజడికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరీంనగర్‌ లోక్‌సభ సభ్యుడు పొన్నం ప్రభాకర్‌ను పరామర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *