Wednesday, 4 November 2026

సీమాంధ్ర ఎంపీల దాష్టీకంపై విచారణకు స్పీకర్‌ ఆదేశం


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 (జనంసాక్షి) :
లోక్‌సభలో సీమాంధ్ర ఎంపీల దాష్టీకంపై స్పీకర్‌ మీరాకుమార్‌ విచారణకు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ బిల్లు గురువారం ప్రవేశం పెట్టిన సందర్భంగా సీమాంధ్ర ఎంపీలు స్పీకర్‌ సహా తోటి సభ్యులపై పెప్పర్‌ స్ప్రే చేయడం, టీడీపీ ఎంపీ కత్తితో సభలో ప్రవేశించి వీరంగం సృష్టించడం, ఎంపీలు స్పీకర్‌ పోడియం సహా టేబుళ్లు, కంప్యూటర్‌ ధ్వంసం చేయడం తదితర ఘటనలపై డెప్యూటీ స్పీకర్‌ నేతృత్వంలో సెక్యూరిటీ కమిటీ విచారణ జరుపుతుందని మీరాకుమార్‌ పేర్కొన్నారు. పార్లమెంట్‌ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సీమాంధ్ర సభ్యులు సభ మర్యాదను మంటగలిపిన విషయం తెలిసిందే. ఇందుకు బాధ్యులైన 16 మంది ఎంపీలపై ఐదు రోజుల పాటు సస్పెన్షన్‌ వేటు వేసిన స్పీకర్‌ మీరాకుమార్‌ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *