Wednesday, 4 November 2026

జైపాల్‌రెడ్డికి మాతృ వియోగం


హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 (జనంసాక్షి) :
కేంద్ర మంత్రి ఎస్‌. జైపాల్‌రెడ్డికి మాతృ వియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి యశోదమ్మ (90) శుక్రవారం హైదరాబాద్‌లోని జైపాల్‌రెడ్డి నివాసంలో శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లి మరణవార్త తెలియగానే జైపాల్‌రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. పలువురు నాయకులు ఆయనకు ఫోన్‌ చేసి సంతాపం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *