Wednesday, 4 November 2026

హింసను రెచ్చగొట్టేందుకే చలో ఢిల్లీ


అప్రమత్తంగా ఉందాం : కోదండరామ్‌
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) :
హింసను రెచ్చగొట్టేందుకే సీమాంధ్ర పెత్తందారులు చలో ఢిల్లీకి పిలుపునిచ్చారని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. తెలంగాణ బిల్లును ఎలాగైనా ఆపాలని సీమాంధ్రుల కుట్ర పన్నారని.. అందువల్లే పార్లమెంట్‌లో హింసకు పాల్పడ్డారని కోదండరామ్‌ ఆరోపించారు. వీరి కుట్రలను భగ్నం చేయాల్సి ఉందన్నారు. తెలంగాణను అడ్డుకునే కుట్ర లు చేస్తే ఇక దాని ఫళితం తీవ్రంగా ఉంటుందని ఢిల్లీ లో మీడియాతో మాట్లాడుతూ హెచ్చరించారు. తెలం గాణలో యువకుల ఆత్మ బలిదానాలు ఇంకా కొన సాగుతున్నాయని అవి ఆగాలంటే వెంటనే తెలంగాణ బిల్లును వెంటనే ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. ఇంకా బిల్లు ఆలస్యం చేస్తే మరిన్ని ఆత్మహత్యలు జరిగే ప్రమాదం ఉందన్నారు. సీమాంధ్ర పాలకుల తీరువల్ల తెలంగాణ యువత ఆందోళన చెందుతోందన్నారు. తెలంగాణ బిల్లును వెంటనే సభ ఆమోదించి తెలంగాణలో యువకుల ఆత్మహత్యలను ఆపాలని కోదండరామ్‌ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఇంకా యువకుల ఆత్మబలిదానాలు కొనసాగుతున్నాయని, తెలంగాణ బిల్లు ఆమోదానికి కాంగ్రెస్‌, బీజేపీ చొరవ చూపాలని ఆయన కోరారు. తెలంగాణ బిల్లును ఎలాగైనా ఆపాలని సీమాంధ్రులు హింసకు పాల్పడు తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర నేత లను అక్కడి ప్రజలే కట్టడి చేయాలని అన్నారు. సీ మాంధ్ర విూడియా పక్షపాతంగా వ్యవహరిస్తూ పెట్టు బడిదారులకు వత్తాసు పలుకుతున్నదని మండిపడ్డారు. జాతీయ మీడియా లగడపాటిది
ఉగ్రవాద చర్య అంటే సీమాంధ్ర మీడియా గొప్పపనిగా చూపిస్తున్నయని మడ్డిపడ్డారు. హైదరాబాద్‌లో అన్ని రాష్టాల్ర ప్రజలు ఉన్నరు. వాళ్లకు లేని భద్రత మీకెందుకని సీమాంద్ర నేతలను ప్రశ్నించారు. కావూరి వ్యాఖ్యలపై స్పందిస్తూ హైదరాబాద్‌ను యూటీ అంటే ఊరుకునేది లేదన్నారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని అన్నారు రాయలసీమను విడగొట్టమనడానికి విూకేం హక్కుంది. సీమాంధ్రులు ప్రత్యేక రైళ్లలో పార్లమెంట్‌పై దాడికి వస్తున్నట్లు తెలుస్తున్నది. తెలంగాణను అడ్డుకుంటే యుద్ధమే జరుగుతది. విూలాగా కృత్రిమ ఉద్యమాలు చేయమని హెచ్చరించారు. తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలి. హైదరాబాద్‌లో అందరం కలిసి శాంతియుతంగా ఉందామని పేర్కొన్నారు. అందరూ సహకరించి తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చాలని కోదండరామ్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *