
రాష్ట్రపతికి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సిఫార్సు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) :
ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శువ్రారం తన పదవికి రాజీనామా చేస్తూ అసెంబ్లీని రద్దు చే యాలని లెప్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌కు సిఫార్సు చేశారు. అయితే గవర్నర్ అందుకు విరుద్ధంగా అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచుతూ రాష్ట్రపతి పాలనకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి సిఫార్సు చేశా రు. ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ శుక్రవారం రాత్రి తన రాజీనామా సమర్పించారు. దీంతో 49 రోజుల ఆప్ పాలనకు తెరపడింది. అయితే రాష్ట్ర అసెంబ్లీని మాత్రం సుప్తచేతనావస్థలో ఉంచాలని ఆయన పం పిన నివేదికలో పేర్కొనట్టు తెలిసింది. దీనిపై రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అనూహ్య పరిణామాల మధ్య సీఎం అరవింద్ కేజీవ్రాల్ రాజీనామా
చేయడంతో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించడం మినహా గత్యంతరం లేకుండా పోయింది. జన్ లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందకపోవడంతో సీఎం కేజీవ్రాల్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అరవింద్ కేజీవ్రాల్ వ్యవహారంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి శనివారం నివేదిక సమర్పించారు. రిలయన్స్ ఛైర్మన్ ముకేష్ అంబానీకి వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్ ను దాఖలు చేయాలంటూ తమ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, బిజెపి కుమ్మక్కయి జన్ లోక్‌పాల్ బిల్లును ఓడించాయని కేజీవ్రాల్ విమర్శించారు. ఆమ్ ఆద్మీ గద్దెనెక్కిన తీరు తరువాత జరిగిన పరిణామాలను ఒక్కసారి విశ్లేషిస్తే డిసెంబర్ 28వ తేదీన కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం గద్దెనెక్కింది. అనంతరం ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కొక్కటిగా అమలులోకి తెచ్చింది. ఉచితంగా రోజుకు 700 లీటర్ల మంచినీరు సరఫరా పథకాన్ని ప్రారంభించింది. నెలకు 400 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు ఛార్జీలను 50 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నారంటూ ఢిల్లీలోని ఆఫ్రికన్ మహిళలపై న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి దాడి చేశారనే ఆరోపణలతో తీవ్ర దుమారం చెలరేగింది. ఈ ఉదంతం పై ఉగాండాకు చెందిన ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. తమపై దాడి చేసిన మంత్రిపై ఎఫ్‌ఐఆర్ నమోదుకు ఆదేశించాలని కోర్టులో పిటిషన్ వేసింది. సోమ్ నాథ్ భారతిపై చర్య తీసుకోవాలని బిజెపి, మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. సోమ్ నాథ్ ఎలాంటి తప్పు చేయలేదని కేజీవ్రాల్ సమర్థించారు. డ్రగ్స్, సెక్స్ రాకెట్ కేంద్రాలపై దాడి చేయాలన్నా వినిపించుకోని పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీఎం కేజీవ్రాల్ ధర్నాకు దిగారు. ఢిల్లీ పోలీసు విభాగాన్ని కేంద్ర ¬ం శాఖ పరిధి నుండి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకరావాలని డిమాండ్ చేశారు. ముగ్గురు పోలీసు అధికారులను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాశ్మీర్‌లో సైన్యం మానవ హక్కులను ఉల్లంఘిస్తోందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత ప్రశాంత్ భూషణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో హిందూ సేన కార్యకర్తలు విధ్వంసాన్ని సృష్టించారు. పలు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారు. ఆప్ లో నిబద్ధత కొరవడిందని, ఇచ్చిన హావిూలను నెరవేర్చడంలో విఫలమైందని ఆ పార్టీకి చెందిన వినోద్ కుమార్ బిన్నీ విమర్శించారు. నంతరం బిన్నీని పార్టీ నుంచి బహిష్కరించారు. మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ హాయంలో కామన్వెల్త్ కుంభకోణంపైనా ఎఫ్‌ఐఆర్ వేయించారు. సహజవాయువు సరఫరాకు గాను రిలయన్స్ అంబానీలకు అత్యధిక రేటు- చెల్లించడంపై కేజీ ప్రభుత్వం ముఖేష్ అంబానీ, మంత్రి వీరప్ప మొయిలీ తదితరులపై కేసు నమోదు చేశారు. జన్ లోక్ పాల్ బిల్లు అసెంబ్లీలో ప్రవేశ పెట్టవద్దని గవర్నర్ జంగ్ ఆదేశాలు పంపించారు. సభలో ప్రవేశ పెట్టేందుకు అవసరమైన మందుస్తు అనుమతి లేదని ఆయన స్పీకర్‌కు రాసిన లేఖలో వివరించారు.అయినా సీఎం కేజీవ్రాల్ అసెంబ్లీలో జన్ లోక్ పాల్ బిల్లు ప్రవేశ పెట్టారు. బిల్లు ప్రవేశ పెట్టేందుకు సంబంధించిన స్పీకర్ ఎంఎస్ ధీర్ ఓటింగ్ కు పెట్టారు. వ్యతిరేకంగా 42ఓట్లు, అనుకూలంగా 27 ఓట్లు వచ్చాయి. అనంతరం సీఎం కేజీవ్రాల్ రాజీనామా చేశారు. దీనితో ఆమ్ ఆద్మీ పార్టీ పాలన 49 రోజులకు ముగిసింది. ఇక ఇప్పుడు రాష్ట్రపతి పాలన తప్ప మరో గత్యంతరం లేకుండా పోయింది.
ఢిల్లీలో రాష్ట్రపతి పాలన




