Wednesday, 4 November 2026

అవినీతి దిగ్గజాలే లక్ష్యంగా


ఆమ్‌ ఆద్మీ దిగ్బంధనం
20 మంది లోక్‌సభ అభ్యర్థుల పేర్లు ఖరారు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16 (జనంసాక్షి) :
పార్లమెంట్‌లోని అవినీతి దిగ్గజాలే లక్ష్యంగా ఆమ్‌ ఆద్మీ దిగ్బంధన వ్యూహానికి తెరతీసింది. ప్రస్తుత పార్లమెంట్‌లో అవినీతి పరుగులగా ఆ పార్టీ పేర్కొన్న 20 మంది లోక్‌సభ సభ్యులపై భరిలో నిలిచే అభ్యర్థులను ఎంపిక జేసి ఆదివారమే ఆ జాబితాను వెల్లడించింది. పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూలు జారీ కాకముందే పార్లమెంటుకు పోటీ చేసే 20మంది అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. పలు పార్టీల ప్రతినిధులపై పోటీకి నిలిపింది. బీజేపీ మాజీ అధ్యక్షుడు గడ్కారిపై అంజలీ దమానియా, కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై కుమార్‌ విశ్వాస్‌, కేంద్రమంత్రి కపిల్‌ సిబాల్‌పై అశుతోష్‌, సల్మాన్‌ఖుర్షీద్‌పై ముకుల్‌ త్రిపాఠి, సురేష్‌ కల్మాడీపై సుభాష్‌ వడె, ముంబయి ఈశాన్యం నుంచి మేథాపాట్కార్‌, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్‌పై బాబా హరిదేవ్‌, గురుదాస్‌ కామత్‌పై మహారాష్ట్ర ఏఏపీ చీఫ్‌ మయాంక్‌ గాంధీ పోటీ చేస్తారు. ఎనిమిది రాష్ట్రాల్లోని 20 లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితా వెల్లడించినట్లు ఆ పార్టీ తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో ఏడు, మహారాష్ట్రలో ఆరు, ఢిల్లీలో రెండు, హర్యానా, అరుణాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిషా, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఒక్కో స్థానంలో ఆప్‌ అభ్యర్థులను ఖరారు చేసింది. అవినీతి క్రిమినల్‌ కేసులతో సంబంధం ఉన్న నేతలను రాజకీయాలకు దూరంగా ఉంచాలన్నదే తమ లక్ష్మమని ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియా తెలిపారు. కేంద్ర సమాచార మంత్రి మనీశ్‌ తివారికి వ్యతిరేకంగా సీనియర్‌ న్యాయవాది హెచ్‌ఎస్‌ పూల్కా పోటీ చేస్తారని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *