Wednesday, 4 November 2026

సభకు ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ సమర్పించిన చిదంబరం


2014-15 ప్రణాళిక వ్యయం 5,55,322 కోట్లు
ప్రణాళికేతర వ్యయం రూ.12,07,892 కోట్లు
ద్రవ్యలోటు 4.60 శాతం
కోతలు వాతలు లేవు.. అన్నీ వరాలే…
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) :
సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం సోమవారం లోక్‌సభలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు తీవ్ర నిరసనల మధ్య తన బడ్జెట్‌ను సమర్పించారు. తమిళ జాతీయాలను జోడిస్తూ ఆయన తన ప్రసంగం కొనసాగించారు. లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఓటాన్‌ అకౌంట్‌ బ్జడెట్‌ను ప్రవేశపెట్టారు. మహిళల భద్రత కోసం నిర్భయ నిధికి రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్లు చిదంబరం ప్రకటించారు. ఎన్నికల నేపథ్యంలో మాజీ సైనికోద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గాలం వేసింది. సైన్యంలో ఒకే ర్యాంకు, ఒకే పింఛను పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ల్లడించారు. దీంతో మాజీ సైనిక ఉద్యోగులకు పింఛన్లు భారీగా పెరగనున్నాయి. అన్ని వస్తువులపై ఎక్సైజ్‌ సుంకం 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించారు. చిన్న కార్లపై ఎక్సైజ్‌ సుంకం 12 నుంచి 8 శాతానికి తగ్గించారు. ఎక్సైజ్‌ సుంకం తగ్గింపుతో చిన్నకార్లు, ద్విచక్రవాహనాలు, మొబైల్‌ ఫోన్ల ధరలు తగ్గనున్నాయి. సోమవారం ఉదయం లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే సీమాంధ్ర ఎంపీలు సభలో నిరసనకు దిగారు. సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేపట్టారు. సీమాంధ్ర ఎంపీల నిరసనల మధ్య సభా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక మంత్రి చిదంబరం సోమవారం లోక్‌ సభలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ నామ్‌కే వాస్తేగా ఉంది. ఒక్క ఆటో రంగం, ఎలక్టాన్రిక్‌ గూడ్స్‌ రంగాలకు కాస్త ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. ఇతరత్రా ఎవరికీ సంతోషం కలిగించే వార్త బడ్జెట్‌లో లేదు. అదే సమయంలో బాధ పెట్టే నిర్ణయం కూడా లేకపోవడమే సంతోషాన్నిచ్చే అంశమే. కార్లు, బైకులు, స్కూటర్లు, మొబైల్‌ ఫోన్ల ధరలు తగ్గించే నిర్ణయాలు చిదంబరం ప్రకటించారు. ఇదంతా పేద మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకుని చేసినట్లుగా అర్థం చేసుకోవచ్చు. ఇతరత్రా నిర్ణయాలన్నీ కేటాయింపులే. కొన్ని కేటాయింపులు యథాతథంగా ఉండగా, మరికొన్ని రంగాలకు కేటాయింపులు పెంచారు. రక్షణ శాఖ బడ్జెట్‌ను 10 శాతం పెంచారు. ఆంధప్రదేశ్‌కు సంబంధించి ప్రత్యేకించి ఎలాంటి కేటాయింపు లేకపోవడం విశేషం. సీమాంధ్రను సంతృప్తి పరిచే నిర్ణయం ఏదైనా ఉంటుందేమోనన్న ఆలోచనను చిదంబరం అసలు పట్టించుకోలేదు. ఇంత ఆందోళన జరుగుతున్నా సీమాంధ్రకు ఊరటకలిగించే ప్రయత్నం చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఆధార్‌కు కట్టుబడే ఉందని చిదంబరం వెల్లడించారు. ఇప్పటికే 57 కోట్ల మంది ఆధార్‌లోకి వచ్చారని తెలిపారు. 27 పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆధార్‌కు కట్టుబడే ఉంది. ఇప్పటికే 57 కోట్ల మంది ఆధార్‌లోకి వచ్చారు. 27 పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీని ప్రవేశపెట్టామని విరించారు. యూపీఏ సగటు వృద్ధిరేటు సూచీలు ఎన్డీఏ హయాంకంటే మెరుగ్గా ఉన్నాయని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని, భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు ఇంకా పటిష్టంగానే ఉన్నాయని చిదంబరం చెప్పుకొచ్చారు. జనవరి చివరి నాటికి ద్రవ్యోల్బణం 5.5 శాతంగా ఉంటుందని అంచనావేశారు. 2013-14 నాటికి 255 మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి కాగలదని అంచనా వేశారు. అలాగే 2013-14లో రూ. 7 లక్షల 35 వేల కోట్ల వ్యవసాయ రుణాలు అందించామని, 2011-12 ఆర్థిక సంవత్సరం నుంచి మందగమనం ప్రారంభం కావడం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పలేదని పేర్కొన్నారు. గత దశాబ్దిలో అంచనాల కంటే భారీగా ఉద్యోగ కల్పన జరిగిందన్నారు. దిగాలు పడిన పారిశ్రామికోత్పత్తి సూచీలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ఆహార ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ ఆందోళన కలిగిస్తోందని వివరించారు. పదేళ్ల క్రితం దేశంలో మొత్తం విద్యుదుత్పత్తి లక్షా 20 వేల మెగావాట్లు.. ప్రస్తుతం 2 లక్షల 44 వేల మెగావాట్లకు విద్యుదుత్పత్తి పెరిగింది. దేశంలో మరో మూడు తయారీ రంగ పారిశ్రామిక జోన్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఉన్నత విద్యకు రూ. 79,459 కోట్లు కేటాయింపుల్లో భాగంగా వైద్య రంగానికి రూ. 36,300 కోట్లు కేటాయింపు చేశారు. ఇక ఈశాన్య రాష్టాల్రు హిమాచల్‌, ఉత్తరాఖండ్‌లకు రూ. 1200 కోట్ల అదనపు సాయం రూ. 1000 కోట్లతో నిర్భయ ఫండ్‌ 2012-2013లో 326 బిలయన్‌ డాలర్ల ఎగుమతి జరిగిందని,. గత దశాబ్దిలో అంచనాల కంటే భారీగా ఉద్యోగ కల్పన జరిగిందని అందువల్ల నెట్టుకు రాగలిగామని వివరించారు. దిగాలుపడిన పారిశ్రామికోత్పత్తి సూచీలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. పదేళ్లక్రితం దేశం మొత్తం విద్యుత్‌ ఉత్పత్తి లక్ష 20 వేల మెగావాట్లు కాగా, ప్రస్తుతం 2లక్షల 44వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి పెరిగిందన్నారు. దేశంలో 50 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. చక్కెర పరిశ్రమలపై నియంత్రణలను పూర్తిగా తొలగించామని, డీజిల్‌ ధరలను మార్కెట్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని వివరించారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా 67 శాతం ప్రజలకు ఆహార భద్రత అందిస్తున్నామని ఇది యూపిఎ సాధించిన అభివృద్ది అని విరించారు. విదేశీ పెట్టు-బడులకు సానుకూల వాతావరణం కల్పించామని, ఫార్మా, విమానయాన, మల్టీబ్రాండ్‌, రి-టైల్‌రంగంలో నిబంధనలు సరళతరం చేశామని చిదంబరం వివరించారు.45 బిలియన్‌ డాలర్లుగా కరెంట్‌ ఖాతా లోటు ఇప్పటికీ ఉందన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ. 11 వేల 200 కోట్లు,. రాష్ట్రాలకు ఇచ్చే సాయాన్ని 1.36 లక్షల కోట్ల నుంచి 3.8 లక్షల కోట్లకు పెంపు జరిగిందన్నారు. త్వరలో దేశవ్యాప్తంగా ప్రత్యక్ష నగదు బదిలీ అమలుచేస్తామన్నారు. శాస్రీయ పరిశోధనలు వేగవంతం చేయడానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. విదేశాల్లో భారతీయుల ఖాతాలపై లోతైన విచారణ జరుగుతోందని చెప్పుకొచ్చారు. బియ్యం రవాణా, ఎగుమతులపై సేవా పన్ను తొలగింపు. 14 వేల కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా 41 లక్షల 16 వేల మంది మహిళలకు రుణాలు పంపిణీ చేశామన్నారు. 8. 9 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలిగేలా 2009 మార్చి 31 వరకు ముందరి విద్యారుణాలపై వడ్డీ మాఫీ చేశామన్నారు. చాలా కీలకమైన బడ్జెట్‌కు అంతరాయం కలిగించవద్దని సీమాంధ్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులకు లోకసభ స్పీకర్‌ మీరా కుమార్‌ సోమవారం పదేపదే విజ్ఞప్తి చేశారు. ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం బడ్జెట్‌ ప్రసంగం చదువుతున్నంత సేపు చిరంజీవి, పళ్లం రాజు, పురంధేశ్వరి, కావూరి సాంబశివ రావు, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ఎంపీలు హర్షకుమార్‌, బొత్స ఝాన్సీ, కనుమూరి బాపిరాజు తదితరులు నిరసన వ్యక్తం చేశారు. వెల్లోకి వెళ్లి, ప్లకార్డులు ప్రదర్శించారు. సమైక్య నినాదాలు చేశారు. దీంతో స్పీకర్‌ వారికి పదే పదే విజ్ఞప్తి చేశారు. ఇవే చివరి సమావేశాలైనందున అడ్డుకోవద్దని, సమస్యలుంటే మాట్లాడుకుందామని, తన ఛాంబర్‌కు రావాలని స్పీకర్‌ వారికి సూచించారు. అయితే, సీమాంధ్ర మంత్రులు మాత్రం ఇవేవిూ పట్టించుకోకుండా తన ఆందోళనను కొనసాగించారు. వియ్‌ వాంట్‌ జస్టిస్‌, సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. సభలో తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య చిదంబరం సభలో తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్టు మాత్రమే ప్రకటించి కూర్చున్నారు. ఆయన కూర్చున్న వెంటనే స్పీకర్‌ షెడ్యూలులో ఉన్న మిగిలిన జాబితా ప్రకారం మంత్రుల పేర్లు చదువుతూ వెళ్లారు. ఆ ప్రకారం మంత్రులు కూడా తమకు సంబంధించిన బిల్లులను ప్రవేశపెట్టినట్టు ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ ఆర్థిక శాఖ మంత్రి తాత్కాలిక బడ్జెట్‌ ప్రసంగం చేయడానికి ఉపక్రమించారు. అంతటితో సీమాంధ్ర మంత్రులు మరింత గట్టిగా నినాదాలు చేస్తూ చిదంబరం ప్రసంగానికి అడ్డుపడ్డారు. ఈ దశలో స్పీకర్‌ ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి సభ్యులు సభ జరగడానికి సహకరించాలని కోరారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు ఆందోళన చేస్తుండగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వారిని వారించారు. అయినా వారు తగ్గలేదు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *