Tuesday, 3 November 2026

తెలంగాణ ఏర్పాటును స్వాగతించిన మాయావతి

న్యూఢిల్లీ,ఫిబ్రవరి20: తెలంగాణ ఏర్పాటుకు బిఎస్పీ, సిపిఐ, ఎన్సీపీలు రాజ్యసభలో పూర్తి మద్దతు పలికాయి. పాశ్‌ఆన్‌ కూడా పూర్తి మద్దతు తెలిపారు. చిన్న రాష్టాల్రతోనే అభివృద్ది సాధ్యమని రాజ్యాంగనిర్మాత అంబేద్కర్‌ అన్నారని రాజ్యసభలో బీఎస్పీ సభ్యురాలు మాయావతి అన్నారు. ఆంధప్రదేశ్‌ పునర్‌వ్యవ్థసీకరణ బిల్లుపై ఆమె మాట్లాడుతూ చిన్న రాష్టాల్రతోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఆమె ప్రసంగానికి సీమాంధ్ర తెలుగుదేశం సభ్యులు, తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యులు పలుమార్లు నో నో అంటూ అడ్డుతగిలారు. చిన్న రాష్టాల్ర ఏర్పాటు కోసమే తమ హయాంలో ఉత్తరప్రదేశ్‌ను నాలుగురాష్టాల్రుగా విభజించాలని అసెంబ్లీ తీర్మానం చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు సంతోషకరమని మాయావతి అన్నారు. హైదరాబాద్‌ను పదేళ్లపాటు తెలంగాణకు ఆంధప్రదేశ్‌కు ఉమ్మడి రాజధాని చేయడం ఎవరికి లాభం కలగదని అన్నారు. సీమాంధ్రతో పాటు తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఆమె కోరారు. దేశంలో పెద్ద రాష్టాల్రతో ఒరిగేదేవిూలేదని మాయావతి స్పష్టం చేశారు. అందుకే పెద్ద రాష్టాల్ర వల్ల అభివద్ధి సాథ్యంకాదని ఆనాడే రాజ్యాంగ నిర్మాత చెప్పిన విషయాలను ఆమె ఊటంకించారు. అందుకే ఉత్తరప్రదేశ్‌ను కూడా నాలుగు రాష్టాల్రుగా విభజించాలని యూపీ అసెంబ్లీ తీర్మానం చేసిందని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతం చాలా వెనుకబడి ఉందని మాయావతి స్పష్టం చేశారు. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుంటే రాష్ట్రం ఇచ్చినా లాభంలేదని పేర్కొన్నారు. అసలు తెలంగాణను ఎప్పుడో ఏర్పాటు- చేయాల్సింది ఇప్పటికే ఆలస్యమైంది అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందనిమాయావతి స్పష్టం చేశారు. తెలంగాణ, సీమాంధ్ర రాష్టాల్రకు పదేళ్లపాటు- ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ పనికిరాదని పేర్కొన్నారు. పంజాబ్‌-హర్యానాలకు చంఢీగఢ్‌ ఇప్పటికి ఉమ్మడి రాజధానిగా కొనసాగుతూనే ఉందని తెలిపారు. వాళ్లు ఇప్పటికీ తమకు సొంత రాజధాని కావాలని డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. సీమాంధ్రతోపాటు తెలంగాణకు కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు. సీమాంధ్రుల కొత్త రాజధానికి ప్రాధాన్యత ఇవ్వాలి, త్వరగా ఏర్పాటు- చేయాలని అని అన్నారు.ఈ రెండు ప్రాంతాలరు నిధులు కేటాయించాలన్నారు. ఇదిలావుంటే తెలంగాణ బిల్లుకు సీపీఐ మద్దతు తెలుపుతోందని సీపీఐ ఎంపీ రాజా అన్నారు. రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఆంధప్రదేశ్‌ విభజన ప్రశాంత వాతావరణంలో జరగాలన్నారు. ఈ అంశంలో కాంగ్రెస్‌ అనుసరించిన విధానంతోనే అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఇరు ప్రాంతాల వెనకబాటును గుర్తుంచుకుని నిధులు కేటాయించి అభివృద్దికి దోహదపడాలన్నారు.విద్యా, ఉద్యోగాల్లో ఇరు ప్రాంతాల ప్రజలకు న్యాయం జరగాలని కోరారు. రాయలసీమ వెనుకబడిన ప్రాంతమని తెలిపారు. తెలంగాణ, రాయలసీమ రెండు ప్రాంతాలు అభివద్ధి చెందాలని పేర్కొన్నారు. చిన్న రాష్టాల్ర ఏర్పాటుకు తాము అనుకూలమని ప్రకటించారు. సీమాంధ్రకు కొత్త రాజధానిని నిర్మించుకునేందుకు వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు తెలంగాణ బిల్లుకు తాము బేషరతు మద్ధతిస్తున్నామని బోడోలాండ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(బీడీఎఫ్‌) ప్రకటించింది. ఈమేరకు ఇవాళ తెలంగాణ బిల్లుపై మాట్లాడుతూ బోడోల్యాండ్‌ రాజ్యసభ సభ్యుడు డయా మేరీ స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు-కు తాము సంపూర్ణ మద్ధతిస్తున్నామని ఎన్పీసీ స్పష్టం చేసింది. ఈమేరకు ఇవాళ రాజ్యసభలో తెలంగాణ బిల్లుపై చర్చ సందర్బంగా ఆపార్టీ సభ్యుడు మాట్లాడారు. హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన పనిలేదని పేర్కొన్నారు. ఎంతో మంది తెలంగాణ పౌరులు అమరులయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధప్రదేశ్‌ రాష్ట్ర విభజన బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్టు ఎల్‌జేపీ ఎంపీ రాంవిలాస్‌ పాశ్వాన్‌ అన్నారు. రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *