Tuesday, 3 November 2026

మేం కఠిన నిర్ణయాలు తీసుకోగలం


జటిలమైన సమస్యలు పరిష్కరించగలం
తెలంగాణ ఇచ్చి నిరూపించాం : ప్రధాని మన్మోహన్‌
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (జనంసాక్షి) :
తాము కఠిన నిర్ణయాలు తీసుకోగలమని నిరూపించామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. జటిల సమస్యలను సైతం పరిష్కరించగల నైపుణ్యం, చొరవ తమకున్నాయని తెలంగాణ ఏర్పాటు ద్వారా చాటామని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం 15వ పార్లమెంట్‌ ముగింపు సమావేశంలో లోక్‌సభలో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, స్పీకర్‌ మీరాకుమార్‌, బీజేపీ నేత సుష్మా స్వరాజ్‌ ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు జాతి నిర్ణయమని ప్రధాని వ్యాఖ్యానించారు. తెలంగాణ బిల్లు ఆమోదం ద్వారా ఈ దేశం నిర్ణయాలు తీసుకోగలదని నిరూపించిందన్నారు. తమ పనితీరును నిర్ణయించేందుకు ప్రజలకు ఓ అవకాశం వచ్చిందన్నారు. స్పీకర్‌కు మిగతా సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజల 60 సంవత్సరాల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలను నెరవేర్చామని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. రాష్ట్ర విభజన చేయడంతో ఎంత కఠినమైన సమస్యనైనా పరిష్కరించగలమని నిరూపించామని తెలిపారు. 15వ లోక్‌సభకు సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలకతీతంగా సభ్యులు ప్రజా సమస్యలపై పోరాడారని పేర్కొన్నారు. మొదటి మహిళా స్పీకర్గా తనను ఎన్నుకున్నందుకు సభ్యులకు స్పీకర్‌ మీరాకుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. సభలో మరింత మంది మహిళా సభ్యులు ఉంటే సంతోషంగా ఉండేదన్నారు. వచ్చే సభలో మరింత మంది మహిళా ఎంపీలు రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సభ స్పందించిన తీరును స్పీకర్‌ గుర్తు చేసుకున్నారు. లోక్‌పాల్‌ బిల్లు ఆమోదం పొందడం సంతోషకరమని విపక్ష నేత సుష్మా స్వరాజ్‌ అన్నారు. లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. అంతకుముందు 15వ లోక్‌సభ సమావేశాల చివరిరోజైన శుక్రవారం సాయంత్రం సభలో స్పీకర్‌ విూరాకుమార్‌ ప్రసంగించారు.కేంద్ర ప్రభుత్వం నిర్భయలాంటి ఎన్నో ముఖ్యమైన చట్టాలను చేసిందని స్పీకర్‌ విూరాకుమార్‌ స్పష్టం చేశారు. ఇవాళ 15వ లోక్‌సభ చివరి సమావేశం సందర్భంగా ఆమె సభలో మాట్లాడారు. గతంలో కంటే సభలో ఇపుడు మహిళా సభ్యుల సంఖ్య పెరిగిందని తెలిపారు. మొదటి మహిళా స్పీకర్‌గా ఎన్నుకున్నారని అన్నారు. పార్లమెంట్‌లో బీజేపీ సహకరించకుంటే తెలంగాణ బిల్లు పాసయ్యేది కాదని కేంద్ర ¬ంశాఖ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే స్పష్టం చేశారు. ఏపీ విభజన బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్ధతునిచ్చిందని పేర్కొన్నారు. విభజన ద్వారా రెండు ప్రాంతాలకు న్యాయం జరిగిందని తెలిపారు. రెండు ప్రాంతాలు అభివద్ధి పథంలో నడుస్తాయని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *