
సీమాంధ్రులకు వీహెచ్ హితవు
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (జనంసాక్షి) :
కొత్త పార్టీ పెడతానని చెబుతున్న కిరణ్ కుమార్ రెడ్డి వెంట వెళ్లకండకండని, ఆయన అందరి నీ నట్టేట ముంచుతారని కాంగ్రెస్ ఏర్పాటుకు ప్రత్యేక సహాయం అందిస్తామని అలాగే ఆ ప్రాంతం అర్థకంగా బలపడేందుకు ప్రత్యేక ప్యాకేజీ అందిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి ఎంపిక ఎంపీ వి హనుమంతరావు విమర్శించారు. ఆయనను నమ్ముకుంటే భంగపాటు తప్పదన్నారు. కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లే దొంగలంతా ఆయన పార్టీలో చేరుతారని, వారిస్థానంలో పార్టీలో చురుగ్గా పనిచేసిన కార్యకర్తలకు అవకాశం దక్కుతుందని వీహెచ్ అన్నారు. అబద్దాలు చెప్పి సీమాంధ్రులను కిరణ్‌కుమార్‌రెడ్డి మోసం చేశారన్నారు. ఆఖరిబంతి పేరుతో అందరినీ కిరణ్ తన చుట్టూ తిప్పుకొన్నారని వీహెచ్ ఆరోపించారు. ఇక తెలంగాణలో తన యాత్రను కొనాసాగించాలని హనుమంతరావు నిర్ణయించారు. ఇందులో భాగంగా మంగళవారం నుంచి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నానని అన్నారు. తెలంగాణ ఏర్పాటు లక్ష్యం నెరవేరడంతో మధ్యలో ఆపేసిన రథయాత్రను తిరిగి కొనసాగిస్తానన్నారు. ఇక్కడ ఉన్న సీమాంద్రలకు ఎలాంటి భయాలు అక్కర్లేదన్నారు. కొందరు పనిగట్టుకుని కావాలని దుష్రచారం చేస్తున్నారని అన్నారు. ఎవరికీ హాని జరగకుండా రక్షించే బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాకు కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామాల్లో ప్రచారం చేస్తామని ఆయన చెప్పారు. సోనియా ఎప్పుడూ మాట మార్చలేదని, అందరూ యూ టర్న్ తీసుకున్నా సోనియా మాత్రం తెలంగాణ విషయంలో వెనక్కిపోలేదని వీహెచ్ పేర్కొన్నారు.
కిరణ్‌ను నమ్ముకుంటే నట్టేట మునుగుతారు




