శాఖాధిపతులతో సీఎస్ సమావేశం
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (జనంసాక్షి) :
తక్షణం శాఖలవారీగా ఉద్యోగుల విభజన పక్రియను ప్రారంభించాలని వివిధ శాఖధిపతులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతి ఆదేశించారు. పలు శాఖ ఉన్నతాధికారులతో సీఎస్ మంగళవారం సచివాలయంలో జరిపిన సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఆయా శాఖ ఉన్నతాఅధికారులు తమ అభిప్రాయాలను తెలియజేస్తూ విభజనకు కనీసం 3 నెలలు సమయం కావాలని తెలిపారు. దీనిపై సీఎస్ స్పందిస్తూ ఉద్యోగుల విభజనను తక్షణం ప్రారంభించాలని తెలిపారు. రాష్ట్ర విభజన విషయాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి ఆధ్వర్యంలో సచివాలయంలో వివిధ శాఖల అధిపతులు కీలక భేటీ జరిగింది. అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మహంతికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిన నేపధ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఆయా శాఖల అధికారులు ఉద్యోగులు తదితర వివరాలతో సమావేశంలో కనిపించారు. దీంతో విభజనకు సంబంధించి సిఎస్ కసరత్తు చేపట్టారు.రాష్ట్ర విభజనతో వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగలతో పాటు ఆస్తులను పంచాల్సి ఉంది. సచివాలయ విభజన, ప్రాంతల వారీగా ఫైళ్ల విభజన, విభజనకు పట్టే సమయం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ఈ సమావేశంలో చర్చిస్తారు. అన్ని అంశాలపై ఒక నివేదిక రూపొందించి బుధవారం ఉదయం మహంతి ఢిల్లీ వెళతారు. కేంద్ర ¬ంశాఖ గురువారం సమావేశమై విభజన తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. మహంతి ఇచ్చే సమాచారంఆధారంగా ఆ తేదీనికి ఖరారు చేస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై కూడా రేపు ఢిల్లీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఈ కసరత్తు చేశారని సమాచారం. దీంతో సచివాలయంలో ఉద్యోగుల హడావిడి కనిపించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె. మహంతికి కేంద్ర ¬ంశాఖ నుంచి పిలుపొచ్చింది. ఈ మేరకు ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం ¬ంశాఖ ఉన్నతాధికారులతో సమావేశమవ్వనున్నారు. ఇప్పటికే గవర్నర్ నరసింహన్ మహంతికి మార్గదర్శకాలు అందించారు. అసెంబ్లీ ఎన్నికలు, శాఖల విభజన తదితర అంశాలన్నింటిపైనా నివేదిక సమర్పిస్తారని తెలుస్తోంది. ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించాలా, రెండు రాష్టాల్ల్రో జరపాలా అనే అంశాలపైనా చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రెండు రాష్టాల్ర ఏర్పాటు- విషయంలో ఉద్యోగుల మధ్య ఎలాంటి వివాదాలు రాకుండా ఓ నివేదికను ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే రాష్ట్ర విభజన సమయంలో తమకు ఉద్యోగాల పంపకాల్లో అన్యాయం జరిగితే ఊరుకోమని తెలంగాణ గెజి-టె-డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. రాజ్యాంగం ప్రకారం తమకు రావాల్సిన ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మొదటిసారిగా కలిశారు. సీఎం కిరణ్ రాత్రికి రాత్రి జీవోలు జారీ చేసి కోట్లకు కోట్లు కొల్లగొట్టారని విమర్శించారు.
ఉద్యోగులను తక్షణం విభజించండి





