Monday, 2 November 2026

ఎన్నికల వేళ

కరువు భత్యం పది శాతం పెంపు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28 (జనంసాక్షి) :
ఎన్నికలు వేళ యూపీఏ ప్రభుత్వం ఓటర్లను ఆకట్టుకునేందుకు గాలం విసురుతోంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం డీఏ పెంచింది. శుక్రవారం ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రివర్గం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో ప్రజాకర్షక పథకాలను ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనితో 50 లక్షల మంది ఉద్యోగులకు, 30 లక్షల మంది ఫించన్‌ దారులకు డీఏ పెంపుతో ప్రయోజనం పొందనున్నారు. అంతేగాక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు పెంపుపై ఈసీ చేసిన ప్రతిపాదనను కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇదిలా ఉంటే ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం భేటీ కొనసాగుతోంది. సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి, ఇతర వెసులుబాట్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కరవుభత్యం పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపడంపైనే ప్రధానంగా చర్చించారని సమాచారం. ఈ మేరకు ఆర్థిక వ్యవహారాల మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయించింది.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం కరవు భత్యం చెల్లింపునకు అంగీకారం తెలిపింది. కేంద్రం నిర్ణయంతో 50 లక్షల మంది ఉద్యోగులు, 30 లక్షల మంది పింఛనుదారులు లబ్ధిపొందనున్నారని తెలుస్తోంది. ఈపీఎఫ్‌వో పథకం కింద పింఛను కనీస మొత్తం రూ. వెయ్యి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *