
హైదరాబాద్, మార్చి 1 (జనంసాక్షి) :
భారతీయ జనతా పార్టీ మాజీ జాతీయాధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి బంగారు లక్ష్మణ్ శనివారం కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1939 మార్చి 17న జన్మించిన బంగారు లక్ష్మణ్ బీజేపీలో సుదీర్ఘకాలం పనిచేశారు. 1975 ఎమర్జెన్సీ కాలంలో ఆయన జైలుకు వెళ్లారు. 1996లో రాజ్యసభకు ఎన్నికైన లక్ష్మణ్ అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో రైల్వేశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అదే సమయంలో బీజేపీ జాతీయాధ్యక్షుడిగా నియమితులయ్యారు. బీజేపీ అధ్యక్షుడైన మొదటి దళితుడు లక్ష్మణే. ఆయన రూ.లక్ష రూపాయలను లంచం తీసుకుంటూ తెహెల్కా డాట్ కామ్ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్‌లో దొరికిపోయి పదవిని కోల్పోయాడు. ఈ కేసులో లక్ష్మణ్ జైలుకు వెళ్లారు. ఆ తర్వాత బీజేపీ లక్ష్మణ్‌ను గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నుకుంది. రాజస్థాన్‌లోని జోలార్ నియోజకవర్గం నుంచి ఆయన భార్యను పార్లమెంటుకు పోటీ చేయించి బిజెపి గెలిపించింది. లక్ష్మణ్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు.
భాజపా నేత లక్ష్మణ్ మృతి




