శేఖర్ నా కుమారుడే
న్యూఢిల్లీ, మార్చి3 (జనంసాక్షి) : పితృత్వం కేసులో ఎన్డీ తివారీ దిగివచ్చారు. కోర్టుకేసులు, డిఎన్‌ఎ టెస్ట్‌ల తరవాత రోహిత్ శేఖర్ తన కుమారుడే అని తివారీ ఒప్పుకున్నారు. చాన్నాళ్లుగా శేఖర్ తన కుమారుడు కాదంటూ తివారీ వాదిస్తూ వచ్చారు. అయితే శేఖర్ కోర్టును ఆశ్రయించి తివారీ తన తండ్రే అని పోరాటం చేశారు. దీంతో ఎట్టకేలకు రోహిత్ శేఖర్‌ను తన తనయుడిగా తివారి అంగీకరించారు. తనను కొడుకుగా అంగీకరించాలని రోహిత్ శేఖర్ ఆరేళ్ల పాటు తివారి పైన న్యాయస్థానంలో పోరాటం చేశారు. ఇప్పుడు తివారీ అతనిని తన కొడుకుగా అంగీకరించారు. రోహిత్ శేఖర్‌ను తాను తనయుడిగా అంగీకరిస్తున్నానని, డిఎన్‌ఏ పరీక్షల్లో కూడా అది నిరూపితమైందని తివారి చెప్పారు. ఆదివారం రోహిత్ శేఖర్‌ను తివారి తన నివాసానికి ఆహ్వానించారు. చాలా ఏళ్ల తర్వాత కొడుకుతో మాట్లాడారు. తాను తన కుటుంబ సభ్యులతో కలిసి పోవడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. కాగా, తన బయోలాజికల్ ఫాదర్ తివారీ అంటూ రోహిత్ శేఖర్ న్యాయస్థానాలలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై ఆయన చాలా కాలంగా న్యాయస్థానం ద్వారా పోరాటం చేశారు. ఎన్డీ తివారీ పితృత్వం కేసు విచారణ ఏళ్ల పాటు విచారణ జరిగింది. రోహిత్ శేఖర్ బయోలాజికల్ ఫాదర్ తివారీ అని డిఎన్‌ఎ పరీక్షల్లో తేలింది. అదే వైద్యపరమైన సాక్ష్యం మాత్రమేనని తివారీ తరఫు న్యాయవాది అంతకుముందు కోర్టుల్లో వాదించారు. ఇప్పుడు తివారీ ఆ యువకుడిని తన కొడుకుగా అంగీకరించడం గమనార్హం. తివారీ పితృత్వం కేసును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. చాన్నాళ్లుగా శేఖర్ తన కుమారుడు కాదంటూ తివారీ వాదిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే శేఖర్ కోర్టును ఆశ్రయించి తివారీ తన తండ్రే అని పోరాటం చేశారు. కృష్ణా..రామా అనుకునే వయస్సులోనూ రాసలీలలు జరిపి ఆంధప్రదేశ్ గవర్నర్ పదవి నుండి వైదొలిగిన తివారీ పితృత్వం కేసులో దిగొచ్చారు. తన తండ్రే అంటూ 32 ఏళ్ల యువకుడు సాగించిన పోరాటంలో చివరగా విజేతగా నిలిచాడు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాష్ట్ర మాజీ గవర్నర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నారాయణ్ దత్ తివారీ పితృత్వ కేసు సుఖాంతం అయ్యింది. 2008లో రోహిత్ శేఖర్ అనే వ్యక్తి తన తండ్రి తివారీ అంటూ కోర్టులో కేసు వేశాడు. అప్పటి నుండి తివారీ మాత్రం రోహిత్ కు తనకెలాంటి సంబంధం లేదంటూ చెబుతూ తప్పించుకుంటూ వస్తున్నాడు. రోహిత్ మాత్రం పట్టు-వదలని విక్రమార్కుడిలా పోరాటం చేస్తూ వచ్చారు. 2012 సంవత్సరంలో డిఎన్‌ఏ పరీక్షకు ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తివారీ కూడా కోర్టు మెట్లు- ఎక్కారు. రక్త నమూనాలు ఇవ్వనని తివారీ మొండికేశారు. చివరకు కోర్టు మొట్టికాయలు వేయడంతో రక్త నమూనాలు ఇచ్చారు. కానీ ఆ నివేదికను రహస్యంగా ఉంచాలంటూ తివారీ సుప్రీంకోర్టును అభ్యర్థించాడు. అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. తివారీ నుండి సేకరించిన రక్తనమూనా నివేదికను బట్టి రోహిత్ శేఖర్ తండ్రి తివారేనని తేలిపోయింది. చివరకు తన కుమారుడు రోహిత్ అని తివారీ ప్రకటించడంతో దీనికి ఫుల్ స్టాప్ పడింది.
నిజం ఒప్పుకున్న తివారీ





