
కేంద్ర మంత్ర జైరామ్ రమేశ్
గుంటూరు, మార్చి 4 (జనంసాక్షి) :
విభజన తర్వాత ఏర్పడే అవశేష ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, హైకోర్టు వేర్వేరు చోట్ల ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్ అన్నారు. అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం చేయకూడదని హైదరాబాద్ పాఠం నేర్పిందని కేంద్రమంత్రి, విభజనపై మంత్రుల బృందం సభ్యుడు జైరామ్ రమేష్ అన్నారు. దీనివల్ల ఇప్పుడు సీమాంధ్రలో అభివృద్ధి వికేంద్రీకరణకు కృషి చేస్తామన్నారు. గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఇక్కడ మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ తదితరులతో కలసి విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్రలో హైకోర్టు, అసెంబ్లీ, ఇతర కార్యాలయాలు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటాయన్నారు. సీమాంధ్రకు కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సీమాంధ్రుల ప్రయోజనాలు కాపాడటంలో కాంగ్రెసు పార్టీ ముందుంటుందని చెప్పారు. 2014 ఎన్నికల కోసం తాము తెలంగాణ ఇవ్వలేదన్నారు. భవిష్యత్తులో ఆంధప్రదేశ్ అంతటా అభివృద్ధి చేస్తామన్నారు. సీమాంధ్ర రాజధానిపై వారంలోగా నిపుణుల కమిటీని నియమిస్తామన్నారు. సీమాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటామని, అభివృద్ధిని వికేంద్రీకరిస్తామని కేంద్రమంత్రి జైరాం రమేష్ అన్నారు. 2014 ఎన్నికల కోసం తెలంగాణ రాష్టాన్న్రి ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు. తెలంగాణ డిమాండ్‌కు భావోద్వేగాలు, ఆర్థిక, రాజకీయ కారణాలున్నాయని చెప్పారు. నెల్లూరు, తిరుపతి, విశాఖ, ఒంగోలు, అమరావతి, కర్నూలు, గంటూరులను సీమాంధ్ర రాజధాని చేయాలనే డిమాండ్లున్నాయని పేర్కొన్నారు. కేంద్రకమిటీ రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ఈవారంలోనే రాజధాని కోసం కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో హైకోర్టు ఒక చోట, రాజధాని మరో చోట ఉన్నాయని గుర్తుచేశారు. అలాగే సీమాంధ్రలో కూడా రాజధాని ఒకచోట, హైకోర్టు మరోచోట, ఇతర కార్యాలయాలను వేరే చోటు ఏర్పాటు చేసే అవకాశముందని వివరించారు. అసెంబ్లీ, హైకోర్టును వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల అధికార వికేంద్రీకరణ జరుగుతుందన్నారు. సీమాంధ్రలో కృష్ణానది బోర్డు, తెలంగాణలో గోదావరి బోర్డు ఉంటాయని తెలిపారు. రెండు, మూడు నెలల్లో హైకోర్టు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేరుపడుతాయని పేర్కొన్నారు. ఐఐటి, ఐఐఎం, గిరిజన వ్యవసాయ విశ్వవిద్యాలయాలను సీమాంధ్రలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సీమాంధ్రలో పెట్రో రిఫైనరీ, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరుకు మెట్రోరైలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. విశాఖ నుంచి చెన్నయ్ వరకు ఇండస్టియ్రల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. విభజన కారణంగా విద్యార్థులు, యువత ప్రయోజనాలకు ఎలాంటి ఆటంకాలు ఉండవన్నారు. ఉమ్మడి ఉద్యోగులు ఏ రాష్ట్రంలో ఉండాలనేది వారే నిర్ణయించుకోవచ్చన్నారు. 2014 ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేదని జైరాం స్పష్టం చేశారు. సీమాంధ్ర అభివృద్ధిపై ఎలాంటి అనుమానాలు వద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఇచ్చినా సీమాంధ్ర అభివృద్ధిపై బాధ్యత ఉందన్నారు. పదేళ్ల వరకు విద్యావ్యవస్థలో మార్పులు ఉండవని చెప్పారు. జలమండళ్లో రాజకీయ నాయకులు ఉండరని, విజ్ఞులు ఉంటారని చెప్పారు. ఉమ్మడి ఉద్యోగులు ఏ రాష్ట్రంలో ఉండాలనుకునేది వారే నిర్ణయించుకోవచ్చునని చెప్పారు. 4 వేల మంది ఉద్యోగులను జనాభా ప్రతిపదికన ఆప్షన్ల మేరకు విభజిస్తామన్నారు. ఇదిలావుంటే గుంటూరులో కేంద్రమంత్రి జైరాం రమేష్ మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా కాన్ఫరెన్స్ ను సమైక్యవాదులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మస్తాన్ వలీ తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు సమైక్యవాదులను అక్కడి నుంచి బయటికి పంపించారు. పోలీసులు ఆందోళనకారులను అదపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. గుంటూరు నగరంలోని రాజీవ్ గాంధీ భవన్లో నిర్వహించిన కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గోనేందుకు విచ్చేసిన కేంద్రమంత్రి జైరాం రమేశ్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. లాలాపేట పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.ఇదిలావుంటే సోమవారం విశాఖపట్నంలో కూడా జైరాంకు సమైక్య సెగ తగిలింది.దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రి జైరాం రమేష్ భారీ కాన్వాయ్‌తో గుంటూరు చేరుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో సెక్యూరిటీ వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతించారు.
అవశేష ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు, అసెంబ్లీ వేర్వేరు




