Tuesday, 3 November 2026

నేడు ఎన్నికల షెడ్యూల్‌


దేశవ్యాప్తంగా కోడ్‌
న్యూఢిల్లీ, మార్చి 4 (జనంసాక్షి) :
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ బుధవారం ప్రకటించనున్నారు. నేటి నుంచే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ కూడా అమల్లోకి రానుంది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రధాన కమిషనర్‌ వీఎన్‌ సంపత్‌ బుధవారం ఉదయం 10.30 గంటలకు షెడ్యుల్‌ ప్రకటించున్నట్లు ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఈమేరకు 10.30 గంటలకు ఎన్నికల సంఘంలో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. ఈసారి ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్లలో అభ్యర్థుల పేర్లు గుర్తులతో పాటు నోటా (నాట్‌ ఫర్‌ ఎబౌ) ఆప్షన్‌ను తొలిసారిగా ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించనున్నారు. షెడ్యూల్‌ ప్రకటించగానే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *