
తెలుగు ఆత్మగౌరవం కోసం కొత్త పార్టీ
జగన్, చంద్రబాబులే టార్గెట్ : కిరణ్
హైదరాబాద్, మార్చి 6 (జనంసాక్షి) :
మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నిద్ర లేచారు. ఎట్టకేలకు పార్టీ పెడుతున్నానని ప్రకటించారు. తెలుగుజాతి ఆత్మగౌరవ పరిరక్షణ కోసం కొత్తపార్టీని పెడుతున్నట్టు స్పష్టం చేశారు. 12న రాజమండ్రిలో జరిగే సభలో పార్టీకి సంబంధించిన పూర్తి విధి విధానాలను వెల్లడిస్తామన్నారు. విభజన వల్ల తమ మనసులు గాయపడ్డాయని, రాష్ట్ర విభజన బిల్లు సందర్భంగా లోక్‌సభలో మన ఎంపీలను బహిష్కరించిన తీరు తెలుగుజాతికి అవమానకరమని అన్నారు. మీడియా సమావేశంలో బహిష్కృత కాంగ్రెస్ ఎంపీలు హర్షకుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ అవమానకరమైన పనులకు పాల్పడిందన్నారు. చంద్రబాబు, జగన్మోహన్రెడ్డిలు ఎప్పుడు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మాట్లాడలేదని ఆరోపించారు. కేవలంపదవుల కోసం వారు పాకులాడారని అన్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు కూడా ఈ విభజనలో పాలు పంచుకున్నాయన్నారు. జగన్‌ది బయట సమైక్యవాదం లోపల విభజనవాదమని ఆరోపించారు. తాను సిఎంగా విభజనను అడుగడుగునా వ్యతిరేకించానన్నారు. చివరి వరకు అడ్డుకుని, చేసేది లేక బయటకు వచ్చి పార్టీ పెట్టడం ద్వారా తెలుగు ప్రజల ఆకాంక్షలను చాటాలని నిర్ణయించానన్నారు. గాయపడిన తెలుగువాడి హృదయాలకు ఉపశమనం కలిగించేందుకు పార్టీని నెలకొల్పనున్నట్టు వెల్లడించారు. తెలుగువారి గుండె చప్పుడే మా విధానం అని అన్నారు. విభజనకు కారణమైన పార్టీలే అధికారం కోసం ఆరాటపడుతున్నాయన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమని తన పాలనలో అవినీతి వుంటే విచారణ జరిపించుకోవచ్చని సవాల్ విసిరారు.విచారణలకు భయపడేది లేదు. ప్రపంచంలో ఉన్న తెలుగువారి కోసమే ఈ పార్టీని నెలకొల్పుతున్నామని, తెలుగువారి స్పందనలే మా పార్టీ ప్రణాళిక అన్నారు. నేను తీసుకున్న నిర్ణయాలను తిరగదోడేందుకు గవర్నర్ ఎవని ప్రశ్నించారు. తెలుగు ప్రజల కోసమే కాంగ్రెస్ సీఎంగా ఉన్నప్పటికీ పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించాను. ఎవరైనా పిచ్చికూతలు కూయకుండా వాస్తవాలు బయటపెట్టాలి. ఆంధప్రదేశ్ విభజన పక్రియను పూర్తిగా వ్యతిరేకించినట్టు కిరణ్ అన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తీరు ప్రజాస్వామ్యానికి సిగ్టుచేటని విమర్శించారు అందుకే తెలుగుజాతి ఆత్మగౌరవ పరిరక్షణ కోసం కొత్తపార్టీని పెడుతున్నట్టు ప్రకటించారు. రాజమండ్రిలో జరిగే సభలో పార్టీకి సంబంధించిన పూర్తి విధి విధానాలను వెల్లడిస్తామన్నారు. పార్టీ పేరు, విధివిధానాలను కూడా అక్కడ నుంచే ప్రకటించనున్నట్టు తెలిపారు. తెలుగువారి గుండె చప్పుడు వినిపించడానికి, ఆత్మగౌరవాన్ని కాపాడటానికే పార్టీని పెడుతున్నామని వివరించారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం కొత్త పార్టీని పెడుతున్నామని కుమార్ రెడ్డి ప్రకటించారు. తెలుగువారికి అవమానాలు ఎదురైతే ఎదుర్కోవడమే తమ పార్టీ లక్ష్యమని కిరణ్ అన్నారు. విభజన జరిగిన విధానం,తీరు,శాసనసభకు పంపించిన డ్రాప్ట్ బిల్లుకాని, పార్లమెంటులో జరిగిన విధానం కాని, మన ఎంపీలను సస్పెండ్ చేయడం కాని, ఇవన్ని అప్రజాస్వామికంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటుగా ఇవి జరిగాయని ఆయన అన్నారు. తెలుగు జాతికి, తెలుగుప్రజలకు చేసిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేశానని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల సిద్దాంతం అవలంబిస్తూ చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు స్పష్టంగా ఏమి చేయాలి?కలసి ఉంచాలని చెప్పని పరిస్థితి ఉందని ఆయన అన్నారు.రాజకీయ లాభం కోసం,వివిధ అంశాలలో లాభం కోసం వారు ప్రవర్తించిన తీరు, శాసనసభలో కూడా కనీసం ఆయన అబిప్రాయం కూడా చెప్పలేకపోయారని కిరణ్ అన్నారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అయితే విభజనకు సహకరించి, బయటేమో సమైక్యవాదం, లోపల విజభన జరిగితే,త్వరగా ముఖ్యమంత్రి కావాలని ఆశ,ఈ రెండూ కూడా పార్లమెంటులో విభజన జరుగుతున్న సమయంలో పార్లమెంటులో చర్చ జరుగుతున్న తరుణంలో ఏభై రోజులలో ముఖ్యమంత్రి అవుతానని ప్లీనరీలో చెప్పారని అన్నారు. కాంగ్రెస్,బిజెపి కలిసి అన్యాయంగా ప్రవర్తించాయని అన్నారు. మోడీ అయితే పురుడు పోసి తల్లిని చంపారని, తల్లి లాంటి ఆంధప్రదేశ్ ను తెలంగాణ కోసం చంపారని అన్నారు. అద్వాని ఇంత లోపభూయిష్టమైన బిల్లు చూడలేదని అంటారు. సుష్మ అయితే బిల్లు పెట్టలేదని అంటారు. ఇక ప్రధాని అయితే మంత్రులు వెల్ లోకి వెళితే హృదయం గాయపడిందని అంటారు.. అని కిరణ్ వ్యాఖ్యానించారు.తెలుగు ప్రజల బాధను,గాయాలను ఒక్కరు కూడా గుర్తించలేదని కిరణ్ అన్నారు.ఈ రాష్ట్రం కలిసి ఉండాలని ఒక్క పార్టీ కూడా రిఫ్లక్ట్ చేయలేకపోయాయని అన్నారు.తెలుగుజాతికి సంబంధించిన వారు,ఆత్మగౌరవం ఉన్నవారు ఈ పార్టీలకు ఓటు వేసే పరిస్థితి లేదని కిరణ్ అన్నారు. కేవలం అధికార దాహం తప్ప మరొకటి వీరికి లేదని అన్నారు. ఏమైనా చేసి ముఖ్యమంత్రి అవ్వాలన్నదే వీరి ధ్యేయంగా ఉందని అన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి, వారి ఆలోచనల మేరకు నడిచేదానికి, వారి విధానాలు అవలంబించేదానికి తామందరం కలిసి కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయం చేశామని కిరణ్ ప్రకటించారు. పన్నెండో తేదీ సాయంత్రం రాజమండ్రిలో సభ పెట్టి పార్టీ విధానాలను ప్రకటిస్తామని కిరణ్ అన్నారు. తన జీవితం తెరచిన పుస్తకం అని అన్నారు. తనపై ఆరోపణలను రుజువు చేయాలని కిరణ్ సవాల్ చేశారు.
నిద్రలేచిన కిరణ్




