Tuesday, 3 November 2026

రెండు రాష్ట్రాలకు కార్యదర్శులను ప్రకటించిన సీపీఐ(ఎం)

తెలంగాణకు తమ్మినేని, ఆంధ్రప్రదేశ్‌కు మధు
హైదరాబాద్‌, మార్చి 8 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌ పునర్వభిజనకు ససేమిరా అన్న సీపీఐ(ఎం) పార్టీ అన్నీ పార్టీల కన్నా ముందే రెండు రాష్ట్రాల శాఖలను ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ కమిటీలు వేర్వేరుగా నియమించింది. ఈ మేరకు ఇద్దరు కార్యదర్శులతో రెండు కమిటీలను ప్రకటించింది. తెలంగాణ కమిటీ కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం, ఆంధప్రదేశ్‌ కమిటీ కార్యదర్శిగా పి.మధులను నియమించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీపీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శనివారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గం కీలక సమావేశం జరిగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కారత్‌, సీతారం ఏచూరి, కేంద్ర కమిటీ సభ్యుడు వి.శ్రీనివాసరావు సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం, ఆంధప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శిగా పెనుమల్లి మధును నియమించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాలకు కమిటీలు నియమించింది మొట్టమొదటి పార్టీ సీపీఎం. వివిధ ప్రజా సంఘాలకు కూడా కమిటీలను వేసింది. తమ్మినేని, మధు విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో పాల్గొన్నారు. పార్టీ నిర్వహించిన వివిధ ఉద్యమాల్లో వీరు చురుకైన పాత్ర పోషించారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ్మినేని విజయం సాధించారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన నేపధ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రెండు రాష్ట్రాలకు రెండు శాఖలను ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో వివిధ ప్రజా సంఘాల కమిటీలకు కూడా సభ్యులను నియమించారు. మున్సిపల్‌ ఎన్నికల తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ నేత  రాఘవులు చెప్పారు. పొత్తులపై రెండు రాష్ట్ర కమిటీలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయని ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *