కలిసుండాలనే ఉద్యమం వస్తుంది : కిరణ్
హైదరాబాద్, మార్చి 10 (జనంసాక్షి) :
మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పగటి కలలతో జై సమైక్యాంధ్ర పార్టీని ప్రకటించారు. తెలుగువారంతా కలిసుండాలనే ఉద్యమం తెలంగాణ నుంచే వస్తుందని ఆయన ఆత్యశపడ్డారు. సోమవారం కిరణ్‌కుమార్‌రెడ్డి తమ కొత్త పార్టీ పేరు ప్రకటించారు. తమ పార్టీ పేరును అందరినీ కలుపుకొని పోయేలా ‘జై సమైక్యాంధ్ర’ అని పెట్టినట్లు ఆయన హైదరాబాదులో విూడియా సమావేశంలో ప్రకటించారు. దానికి ఆయన అధ్యక్షుడిగా ఉంటారు. ఉపాధ్యక్షులుగా మాజీ ఎంపీలు ఉన్నారు. జి గంగాదర్ కార్యదర్శిగా ఉన్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించిన లగడపాటి వ్యూహకర్తగా ఉంటారు. సమైక్యాంధ్రలో ముందుండి పోరాడిన అందరినీ కలుపుకుని పోతున్నామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టిక్కట్లను ప్రజాసేవ చేసేవారికి ఇస్తామన్నారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో కొత్త పార్టీ పెడుతున్నట్టువిూడియా సమావేశంలో చెప్పారు. ఇందులో సబ్బం హరి, లగడపాటి, సుచరితారెడ్డి, తులసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగు ప్రజలను కలుపుకుని పోయేలా పార్టీ ఉంటుందని కిరణ్ అన్నారు. తెలుగు జాతికి మేలు చేయడం కోసం తమ పార్టీ పనిచేస్తుందన్నారు. ఆత్మగౌరవంతో ఓటు వేయాలనుకునే వారి కోసం పార్టీ పెడుతున్నట్టు వెల్లడించారు. తమ పార్టీలో టికెట్ల కోసం ఇప్పటికే అనేక దరఖాస్తులు వచ్చాయని మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. జై సమైక్యాంధ్ర అని తమ పార్టీ పేరును ఈరోజు ప్రకటించిన ఆయన ఎల్లుండి రాజమండ్రిలో జరగబోయే సభలో మరిన్ని వివరాలు చెబుతానని, పార్టీ విధానాలు, సిద్దాంతాల గురించి వివరిస్తామని తెలిపారు. సమైక్యాంధ్ర కోసం పనిచేసిన వారందరినీ పార్టీలో చేర్చకుంటామన్నారు. పిరికితనమున్న చంద్రబాబుతో కలిసి పనిచేయడం తనకు అవమానకరమన్నారు. విభజనకు ముఖ్య కారకుడు చంద్రబాబేనని అన్నారు. విభజన ద్వారా తెలుగు ప్రజలకు ద్రోహం చేసింది చంద్రబాబే అన్నారు. తెలుగువారికి కాంగ్రెస్, బీజేపీ తీవ్ర అన్యాయం చేశాయని ధ్వజమెత్తారు. లాభనష్టాలు ఆలోచించకుండా విభజన చేశారని విమర్శించారు. తెలుగు జాతికి అన్యాయం చేసిన తర్వాత కాంగ్రెస్‌లో కొనసాగకూడదన్న ఉద్దేశంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని వెల్లడించారు. విభజన వల్ల నష్టపోయేది తెలంగాణ అని అన్నారు. తెలుగువారందరూ కలిసిమెలిసి ఉండాలన్నదే తమ పార్టీ లక్ష్యమన్నారు. రాష్ట్రం కలిసుండాలనే ఉద్యమం త్వరలో తెలంగాణ నుంచే వస్తుందని మాజీ ముఖ్యమంత్రి అన్నారు. తెలుగువారంతా కలిసి మెలిసి ఉండాలనేదే తమ పార్టీ ముఖ్య సిద్దాంతమన్నారు. ఇబ్బందులు వస్తే ప్రజలు కచ్చితంగా తిరగబడతారని తెలుసుకోవాలన్నారు. విభజన అనేది ప్రజల మేలుకోసమే జరగాలని పార్టీలు, నాయకుల కోసం రాష్ట్ర విభజన జరగకూడదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్‌రెడ్డి బెర్లిన్ గోడ ముక్కను విలేకరులకు చూపించారు. కలిసి ఉండాలనే బలమైన కాంక్షతోనే తూర్పు, పశ్చిమ జర్మనీల మధ్య ఉండే గోడను ప్రజలే బద్దలుగొట్టారని ఆయన గుర్తుచేశారు. పార్టీ సీఎంగా ఉన్నప్పుడే అధిష్ఠానం మాట వినలేదన్నారు. పార్టీని విభేదించే తాను బయటకు వచ్చానన్నారు. రాష్ట్ర విభజనకు ముఖ్య కారకుడు చంద్రబాబన్న విసయం మరచిపోలేమన్నారు. చంద్రబాబు తన అభిప్రాయాలను అసెంబ్లీలో కూడా చెప్పలేకపోయారని, తెలుగుప్రజలకు కాంగ్రెస్, బిజెపి కలిసి తీవ్ర ద్రోహం చేయడం వల్లనే ఈ దుస్థితి వచ్చిందన్నారు. పార్టీలో ఉన్నప్పుడే కాంగ్రెస్ పెద్దల మాట వినలేదు, లేనప్పుడు ఎలా వింటానని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన పక్రియలో కేందప్రభుత్వం ¬మ్వర్క్ సరిగా చేయలేదని గతంలో చేసిన ఆరోపణలను పునరుద్ఘాటించారు. బిల్లు పార్లమెంటులో పెట్టిన తర్వాత రోజు సవరణలు పెట్టారంటే అర్థమేంటి? అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన వల్ల తెలంగాణ రైతులకు ఎంతో నష్టం కలుగుతుందని చెప్పానని, అదే జరగబోతోందన్నారు. తెలంగాణ వల్ల అందరికంటే ఎక్కువ నష్టం మహబూబ్‌నగర్ జిల్లాకేనన్నారు. ఎగువ రాష్ట్రంగా తెలంగాణకు నీటి కస్టాలు తప్పవన్నారు. తెలంగాణలో పంపుసెట్లు ఎక్కువగా ఉన్నాయి కనుక ఇబ్బందులు వస్తాయన్నారు. విభజన వల్ల కరెంటు కష్టాలు, నీటి యుద్ధాలు వస్తాయని చెప్పారు. రేపు అదే జరగబోతోందని అన్నారు. అందుకే కలసి ఉండాలనే ఉద్యమాలు కూడా వస్తాయన్నారు. రాజమండ్రిలో జరిగే సభలో అన్ని వివరాలు వెల్లడిస్తమాన్నారు. పార్టీకి కొందరితో కమిటీని ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ విషయంలో గత కొంత కాలంగా కొనసాగుతున్న సస్పెన్షన్‌కు ఎట్టకేలకు తెరపడింది. తన పార్టీ పేరును జై సమైక్యాంధ్రగా ప్రకటించారు. పార్టీ నినాదం తెలుగు వారి ఆత్మగౌరవం. పార్టీ పేరును ప్రకటించిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. ఆత్మగౌరవం కోసమే తమ పార్టీ ఆవిర్భవించిందని పేర్కొన్నారు. నేను పార్టీ సీఎంగా ఉన్నప్పుడే అధిష్టానం మాట వినలేదు. ఇప్పుడు తానేలా కాంగ్రెస్ అధిష్టానం మాట వింటానని జైరాం రమేష్ ఎలా అన్నారో తనకు తెలియడం లేదన్నారు. పార్టీని విభేదించే తాను బయటకు వచ్చానని చెప్పారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం సరిగా ¬మ్వర్క్ చేయలేదన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టిన తర్వాత రోజు సవరణలు చేయడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు. లాభనష్టాలు కూడా ఆలోచించకుండా అడ్డగోలుగా విభజన చేపట్టారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన వల్ల తెలంగాణ రైతులకు ఎంతో నష్టం కలుగుతుందని ముందే చెప్పానని గుర్తు చేశారు. తెలంగాణలో పంపుసెట్లు ఎక్కువగా ఉన్నాయి కనుక ఇబ్బందులు వస్తాయని చెప్పానని తెలిపారు. తెలంగాణ వల్ల అందరికంటే మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు ఎక్కువ నష్ట పోతారని చెప్పారు. తెలంగాణ రాక ముందూ అసత్యాలే.. వచ్చాకా అసత్యాలే చెబుతున్నారని కోపోద్రిక్తులయ్యారు. రాష్ట్ర విభజనకు ముఖ్య కారకుడు చంద్రబాబే అని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన ద్వారా తెలుగు ప్రజలకు ద్రోహం చేసింది చంద్రబాబే అని నిప్పులు చెరిగారు. బాబు తన అభిప్రాయాలను అసెంబ్లీలో కూడా చెప్పలేకపోయారన్నారు. తెలుగు ప్రజలకు కాంగ్రెస్, బీజేపీ కలిసి తీవ్ర ద్రోహం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీలో ఇప్పటికే అనేకులు పార్టీ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. తెలంగాణ నుంచి కూడా ఉన్నారని అన్నారు. అయితే తాము టిక్కెట్లు అమ్ముకోవడం, రిజర్వ్ చేయడం లేదన్నారు.
పగటి కల కిరణ్ కొత్త పార్టీ ‘జై సమైక్యాంధ్ర’





