డిజైన్ మార్చాల్సిందే : బలరామ్ నాయక్
వరంగల్, మార్చి 10 (జనంసాక్షి) :
పోలవరం డిజైన్ మార్చకపోతే వందేళ్లయినా పూర్తి కాదని కేంద్ర మంత్రి బలరామ్ నాయక్ అన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రాజెక్ట్ ఏర్పాటు అసాధ్యమని హన్మకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి బలరామ్ నాయక్ ఈ వ్యాఖ్యలు చేశారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలిపితే ఒప్పుకొనే ప్రసక్తే లేదని, అసలు మరో వందేళ్లయినా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల ఒడిశా, తెలంగాణ రాష్టాల్రు కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. పోలవరం డిజైన్ మార్చకపోతే వందేళ్లయినా ఆ ప్రాజెక్ట్ పూర్తికాదని ఆయన అన్నారు. సీమాంధ్రలో ప్రయోజనం పొందేందుకే పోలవరానికి ప్రత్యేక ¬దా కట్టబెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలిపితే ఒప్పుకొనే ప్రసక్తే లేదని, అసలు మరో వందేళ్లయినా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని అన్నారు. దీనివల్ల ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. టిఆర్‌ఎస్‌తో పొత్తులు ఉన్నా లేకున్నా కాంగ్రెస్‌కు వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పొత్తుల కోసం వెంపర్లాట్లేదని ఆయన అన్నారు. వంద సంవత్సరాలైనా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని, పోలవరం ముంపు గ్రామాలు తెలంగాణలోనే ఉంటాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వేంటనే మహబూబాబాద్‌ను జిల్లాగా చేస్తామని బలరాంనాయక్ హామీ ఇచ్చారు.
వందేళ్లయినా పోలవరం పూర్తికాదు





