యూపీని విభజిస్తేనే అభివృద్ధి : అజిత్‌సింగ్
న్యూఢిల్లీ, మార్చి 10 (జనంసాక్షి) :
సమాజ్‌వాదీ పార్టీని వీడిన సీనియర్ నాయకుడు అమర్‌సింగ్, రాంపూర్ ఎంపీ జయప్రద సోమవారం అజిత్ సింగ్ సారథ్యంలోని రాష్ట్రీయ లోక్‌దళ్‌లో చేరారు. 2008 నోటుకు ఓటు కుంభకోణంలో తీహార్ జైలుపాలయిన తర్వాత అమర్‌సింగ్ చాలాకాలం వరకూ రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు ఎంపీ జయప్రద కూడా అదే పార్టీలో చేరారు. ఇటీవల జయప్రద కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం సాగింది. అయితే ఎన్నికలకు ముందు ఎవరు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి ఉందిసమాజ్ వాదీ పార్టీ మాజీ నేత అమర్‌సింగ్, జయప్రదలు రాష్టీయ్ర లోక్ దళ్ తీర్థం తీసుకున్నారు. ఢిల్లీలో సోమవారం నాడు జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు అజిత్ సింగ్ సమక్షంలో వారిరువురూ ఆర్‌ఎల్డీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అమర్ సింగ్ ఫతేపూర్ సిక్రీ నుంచి, జయప్రద సికర్ నుంచి పోటీ చేయవచ్చని సమాచారం. ఉత్తర్ ప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రాన్ని కూడా విభజించాలని ఈ సందర్భంగా అమర్‌సింగ్ వ్యాఖ్యానించారు. అజిత్‌సింగ్ కూడా ఆయన వ్యాఖ్యలను సమర్థించారు. 2008 నోటుకు ఓటు కుంభకోణంలో తీహార్ జైలుకు వెళ్లి వచ్చిన తరువాత అమర్ సింగ్ చాలాకాలం వరకు రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. సమాజ్ వాదీ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అమర్‌సింగ్, జయప్రదలను 2010లో ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ పార్టీ నుంచి బహిష్కరించారు. అనంతరం వీరిద్దరూ తిరిగి పార్టీలో చేరుతారని వార్తలు వచ్చినా అలాంటిదేమి లేదని అమర్ సింగ్ తోసిపుచ్చారు. ఇక అందాలతార జయప్రద కూడా తన స్వరాష్ట్రమైన ఆంధప్రదేశ్ రాజకీయాల్లోకి క్రియాశీలమవుతారని, తెలుగుదేశం పార్టీలో చేరుతారని ఊహాగానాలు వెలువడ్డాయి. మరోసారి ఆమె కాంగ్రెస్ లో చేరుతారని, రాజమండ్రి నుంచి లోక్ సభకు పోటీ చేయించేందుకు కాంగ్రెస్ అధిష్టానం హామీనిచ్చిందని వార్తలు వినిపించాయి. చివరకు ఆర్‌ఎల్డీలో చేరిపోయారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఆర్‌ఎల్డీలో యూపిలో 8 స్థానాలకు పోటీ చేయనుంది. ఆర్‌ఎల్డీ నేత అజిత్ సింగ్ నేతృత్వంలో వీరు పార్టీలో చేరారు.
ఆర్‌ఎల్డీలోకి అమర్‌సింగ్, జయప్రద





