
మందుపాతరకు 20 మంది జవాన్లు మృతి
రాయ్‌పూర్, మార్చి 11 (జనంసాక్షి) :
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పంజా విసిరారు. మావోయిస్టుల మెరుపుదాడిలో 20 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృత్యువాత పడ్డారు. సుకుమా జిల్లా టోంగ్‌పాల్ అటవీ ప్రాంతంలో జీరం ఘాటి వద్ద మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. మందుపాతర పేల్చి, కాల్పులు జరపడంతో 19 మంది భద్రతా సిబ్బంది, ఒక పౌరుడు మృతి చెందారు. భద్రతా సిబ్బందిలో 11 మంది సీఆర్‌పీఎఫ్ 80వ బెటాలియన్‌కు చెందినవారు కాగా నలుగురు రాష్ట్ర పోలీసులుగా గుర్తించారు. జవాన్లు రోడ్డు ప్రారంభోత్సవానికి వెళ్లి తిరిగి వస్తుండగా 300 మంది మావోయిస్టులు భద్రతా బలగాను చుట్టుముట్టి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సీఆర్పీఎఫ్ జవాన్లు మావోయిస్టుల మధ్య చాలాసేపు కాల్పులు జరిగినట్లు సమాచారం. కాల్పులు జరిగిన ప్రదేశం దట్టమైన అటవీప్రాంతం కావడంతో పోలీసులకు పైర్తి సమాచారం అందడానికి సమయం పట్టింది. రోడ్డు మార్గం ద్వారా వెళ్లడం సురక్షితం కాకపోవడంతో జగదల్‌పూర్, రాయ్‌పూర్ నుంచి రెండు హెలికాప్టర్లలో సహాయ సిబ్బంది, ఉన్నతాధికారులు ఘటనాస్థలకి వెళ్లారు. గాయపడ్డ జవాన్లను సోంపల్లి ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేపట్టారు. 50 మంది జవాన్లు రోడ్డు ప్రారంభోత్సవానికి వెళ్లి తిరిగి వస్తుండగా 300 మంది మావోయిస్టులు భద్రతాబలగాలను చుట్టుముట్టి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సీఆర్పీఎఫ్ జవాన్లు, మావోయిస్టుల మధ్య చాలాసేపు కాల్పులు జరిగినట్లు సమాచారం. కాల్పులు జరిగిన ప్రదేశం దట్టమైన అటవీప్రాంతం కావడంతో పోలీసులకు పూర్తి సమాచారం అందడానికి సమయం పట్టింది. అక్కడికి వెళ్లే మార్గంలో మావోయిస్టులు మరిన్ని మందుపాతరలు అమర్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రోడ్డు మార్గం ద్వారా వెళ్లడం సురక్షితం కాకపోవడంతో జగదల్‌పూర్, రాయ్‌పూర్ నుంచి రెండు హెలిక్టాపర్లలో సహాయసిబ్బంది, ఉన్నతాధికారులు ఘటనాస్థలికి వెళ్లారు. గాయపడ్డ జవాన్లను సోంపల ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేపట్టారు. ఘటన జరిగిన వెంటనే సిఎం రమణ్ సింగ్ ఉన్నతాధికారులతో చర్చించారు. తక్షణ సహాయక చర్యలపై దృష్టి సారించారు. వెంటనే తగిన చర్యలు తీసకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. మరోవైపు కేంద్ర ¬ంశాఖ కూడా అప్రమత్తం అయ్యింది.




