
దిద్దుబాటు చర్యలకు రంగంలోకి దిగిన దిగ్విజయ్
నేతలతో బిజీ బిజీ భేటీలు
హైదరాబాద్, మార్చి 13 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే తమ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థలకు సంబంధించి త్వరలోనే కాంగ్రెస్ జాబితాను ప్రకటిస్తామని దిగ్విజయ్ తెలిపారు. ఈనెల 22-28 తేదీల మధ్య కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నట్లు తెలిపారు. గురువారం తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ, శనివారం అంధప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం ప్రాథమిక జాబితా రూపొందించి స్టీరింగ్ కమిటీకి నివేదించనున్నట్లు చెప్పారు. గురువారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న దిగ్విజయ్‌కు నేతలు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. పీసీసీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దానం నాగేందర్, శ్రీధర్‌బాబు ఘన స్వాగతం పలికారు. రానున్న ఎన్నికలలో ఎంపీలు, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై ఇరుప్రాంతాల నేతలతో భేటీ అయి దిగ్విజయ్ కసరత్తు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ సాయంత్రం వరకు దిగ్విజయ్‌సింగ్ హైదరాబాద్‌లోనే మకాం వేయనున్నారు. దిగ్విజయ్‌సింగ్ తెలంగాణ ప్రాంత నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఢిల్లీ నుంచి ఉదయం హైదరాబాద్ చేరుకున్న దిగ్విజయ్ పార్కు హయత్ ¬టల్‌లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అభ్యర్థిత్వాల ఎంపికపై నేతలతో చర్చించనున్నట్లు దిగ్విజయ్ విూడియాకు వెల్లడించారు. పార్కు హయత్ ¬టల్‌లో దిగ్విజయ్‌సింగ్, ఏఐసీసీ కార్యదర్శులు కుంతియా, తిరునావక్కరుసు, ఆంధప్రదేశ్, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ పీసీసీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరలు సమావేశమయ్యారు. మార్చి నెలాఖరు కల్లా తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేస్తామని దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. అంతకుమందు ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నేడు,రేపు తెలంగాణ ఎన్నికల కమిటీతో సమావేశం అవుతానన్నారు. శనివారం ఆంధప్రదేశ్ ఎన్నికల కమిటీతో సమావేశం నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ఎంపికపై ఇరు రాష్ట్రాల నేతలతో చర్చిస్తానని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. లోక్‌సభ, వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలలో ఎంపీలు, ఎమ్మెల్యేల అభ్యర్థుల ఎంపికపై అయా రాష్ట్రాల నేతలతో దిగ్విజయ్ సింగ్ సమావేశం కానున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార, మెనిఫెస్టో సమావేశాలుంటుందని తెలిపారు. ఈనెల 15వ తేదీన ఆంధప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార, ఎన్నికల మేనిఫెస్టో సమావేశాలు ఉంటాయని తెలిపారు. ఈ సమావేశం ఉదయం నుండి 10 నుంచి మధ్యాహ్నాం మూడు గంటల వరకు ఉంటుందని తెలిపారు. ప్రాథమిక జాబితాను రూపొందించి స్టీరింగ్ కమిటీకి నివేదిస్తామని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.
రెండు రాష్ట్రాల్లో గెలుపే లక్ష్యం




