
అంతా ఫ్రీ
బాబు మునిసిపల్ ఎన్నికల మేనిఫెస్టో
హైదరాబాద్, మార్చి 13 (జనంసాక్షి) :
ఎలాగైనా ఓటర్లను ఆకట్టుకోవాలనుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మునిసిపల్ ఎన్నికలకూ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేశారు. అన్నీ ఉచితంగా ఇచ్చేస్తామంటూ హామీ జల్లు కురిపించాడు. మరోసారి తాను ఆల్ ఫ్రీ బాబునని చాటుకున్నాడు. నవరత్నాల పేరుతో ప్రకటించిన మేనిఫెస్టోలో అన్ని మునిసిపాలిటీల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా 20 లీటర్ల మినరల్‌వాటర్‌ను రూ.2కే అందజేస్తామని, మునిసిపాలిటీల్లో నీటి కొరత లేకుండా చూస్తామని తెలిపారు. తాము మునిసిపాలిటీలకు ఒక రూపం తీసుకువస్తే అవి కాంగ్రెస్ హయాంలో మురికికూపాలుగా మారాయని తెలిపారు. పచ్చదనం, పరిశుభ్రద, మురికి కాల్వలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, టీడీపీ అధికారంలోకి రాగానే ఇంటికొక ఉద్యోగం ఇస్తామని, మునిసిపాలిటీల పరిధిలోని నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తామని, ప్రైవేటు వాహనాల డ్రైవర్లకు పట్టణాలు, నగరాల్లో ఇళ్లు కట్టిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
నవ్వకుండానే నవరత్రాలు




