
ఓపినియన్ పోల్స్.. ఫాల్స్
బెంగళూర్ రోడ్ షోలో కేజ్రీవాల్
బెంగళూర్, మార్చి 15 (జనంసాక్షి) :
మోడీ కాగితం పులేనని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆయనకు మీడియా అధిక ప్రచారం కల్పిస్తోంది తప్ప నిజంగా అంతటి ఆదరణ లేదని అన్నారు. శనివారం కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన నరేంద్రమోడీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రసార మాధ్యమాలు నరేంద్రమోడీని కావాలని హైలెట్ చేస్తున్నాయని మారోసారి కార్పొరేట్ మీడియాపై అక్కసు వెళ్లగక్కాడు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని సర్వేలు పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు. ఓపినియన్ పోల్స్‌ను ఫాల్స్‌గా అభివర్ణించారు. కొన్ని పార్టీల ప్రయోజనాల కోసం కొన్ని మీడియా సంస్థలు తప్పుడు సర్వేలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని ఆరోపించారు.
మోడీ కాగితం పులి




