Wednesday, 4 November 2026

కష్టకాలమిది.. పార్టీకి అండగా ఉండండి


ఇరు ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలి
దిగ్విజయ్‌సింగ్‌ ఆకాంక్ష
హైదరాబాద్‌, మార్చి 15 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌ పార్టీ కష్టకాలంలో ఉందని, ఇలాంటి తరుణంలో నాయకులు పార్టీకి అండగా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. అయితే కాంగ్రెస్‌ విజయానికి ఇవేవీ అడ్డంకి కాదన్నారు. ఇరుప్రాంతాల్లో పార్టీ విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. గాంధీభవన్‌ ప్రాంగణంలో నిర్మించిన ఇందిరాభవన్‌ను శనివారం దిగ్విజయ్‌సింగ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధప్రదేశ్‌, తెలంగాణ పీసీసీ అధ్యక్షులుగా ఎన్‌.రఘువీరా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య బాధ్యతలు స్వీకరించారు. బొత్స సత్యనారాయణ నుంచి రఘువీరా, పొన్నాలలు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంతో పాటు ఇరు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. రెండు పీసీసీల ఏర్పాటుతో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రెండు రాష్టాల్రు అభివద్ధి చెందేలా కషి చేస్తామన్నారు. ఇందిరాభవన్‌లో ఆంధప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీని ఇరు ప్రాంతాలలో బలోపేతం చేయాల్సిన అవశ్యకతను ఆయన ఈ సందర్బంగా వివరించారు. రెండు పీసీసీ ఏర్పాటుతో కొత్త అధ్యాయనానికి నాంది పలుకుతున్నామని దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. ఆంధప్రదేశ్‌ రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఇందిరా భవన్‌లో ఆంధప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యకలాపాలు, గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. పీసీసీ అధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఇరు ప్రాంతాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *