Wednesday, 4 November 2026

పునర్నిర్మాణం మా వల్లే సాధ్యం టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌


తెరాసలో చేరిన శ్రీనివాస్‌గౌడ్‌, రసమయి, జైపాల్‌
హైదరాబాద్‌, మార్చి 16 (జనంసాక్షి) :
తెలంగాణ పునర్నిర్మాణం తమ వల్లే సాధ్యమని టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కె. చం ద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చు కోగలిగామని, రాష్ట్ర పునర్నిర్మాణం చేసుకుని తీరుతామని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం ఒక్క టీఆర్‌ఎస్‌ ద్వారానే సాధ్యమన్నారు. ఆదివారం నగరంలోని తెలంగాణ భవన్‌లో తెలుగుదేశం పార్టీకి చెంది న శాసనసభ్యుడు జయపాల్‌ యాద వ్‌, టీ జేఏసీ నాయకుడు, టీజో వోస్‌ మాజీ అధ్యక్షుడు శ్రీనివా స్‌గౌడ్‌, తెలంగాణ ధూం ధాం మాజీ కన్వీనర్‌ కళాకారుడు రసమ యి బాల్‌కిషన్‌లు కేసీఆర్‌ సమక్షం లో టీఆర్‌ కేసీఆర్‌ మాట్లాడుతూ, ప్రజా ఉద్యమాలు, కేంద్రంపై తీవ్రమైన ఒత్తిడితోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలంగాణ ప్రజలు అభివృద్ధి కోసం ఇప్పుడు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారని అన్నారు. ప్రజల ఆశలు నెరవేర్చాలంటే టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇతర పార్టీలు చెప్పే మాటలకు, వాగ్దానాలకు మోసపోవద్దన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ఎవరు పోరాటం చేశారో, ఎవరు ప్రాణత్యాగాలు చేశారు ప్రజలకు తెలుసునన్నారు. కత్తి ఒకరి చేతిలో పెట్టి ఇంకొక్కరితో చేయరాదని అందకే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలన్నారు. తెలంగాణను మేమే ఇచ్చాం, మేమే తెచ్చాం అని పలికే కాంగ్రెస్‌ నేతల మాటల్లో వాస్తవం లేదని రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేస్తే వారు ఏమి చేశారో అందరికీ తెలుసునన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశలు ఏమిటో ఉద్యమ పార్టీగా తమకే పూర్తి అవగాహన ఉందని ప్రజల అభ్యున్నతే తమ అభిమతమని, అందుకోసం పాటు పడతామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *