Wednesday, 4 November 2026

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు

సోనియా, రాజ్‌నాథ్‌, కేజ్రీవాల్‌ నివాసాల్లో రంగుల హరివిల్లు
న్యూఢిల్లీ, మార్చి 17 (జనంసాక్షి) :
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు మిన్నంటాయి. ఊరూరా ప్రజలు, యువకులు, నాయకులు రంగుల్లో తడిసి ముద్దయ్యారు. ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసం టెన్‌ జన్‌పథ్‌లో ¬లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సోమవారం నాడు పలువురు పార్టీ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. సోనియా దేశ ప్రజలకు ¬లీ శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్‌ నేతలు మోతీలాల్‌ ఓరా, అజిత్‌ జోగి వంటి నాయకులు సహా అనేక మంది కార్యకర్తలు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కార్యకర్తలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలకు సోనియాగాంధీ మిఠాయిలు పంచిపెట్టారు. భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ నివాసంలో సోమవారం ¬లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. అందరూ కలిసి ¬లీ వేడుకల్లో ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ దేశ ప్రజలకు ¬లీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజల జీవితాలను రంగుల మయం చేయాలని రాజ్‌నాథ్‌సింగ్‌ ఆకాంక్షించారు. పండుగ వేళ రాజకీయాల గురించి చర్చించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.ఈ రోజు ఏ పార్టీపైనా, ఏ రాజకీయ నాయకుడిపైనా వ్యాఖ్యలు చేయబోనని ఆయన స్పష్టం చేశారు. ఈ వేడుకలో భాగంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ డప్పు కొట్టడం అందరినీ ఆకట్టుకుంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసంలోనూ రంగుల పండుగ అంబరాన్ని అంటింది. పార్టీ కార్యకర్తలు, నాయకులతో పాటు సాధారణ ప్రజలు కేజ్రీవాల్‌ నివాసానికి తరలివచ్చి ఆయనకు రంగులు పూసి శుభాకాంక్షలు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *