
70 మందికి చోటు
కొన్ని చోట్ల సిట్టింగులు గల్లంతు
టీజీఓ నేత శ్రీనివాస్‌గౌడ్‌కు మహబూబ్‌నగర్ అసెంబ్లీ సీటును, ధూంధాం వ్యవస్థాపకుడు రసమయి బాలకిషన్‌కు కరీంనగర్ జిల్లా మానకొండూరు అసెంబ్లీ సీటును, ఓయూ జేఏసీ నేత పిడమర్తి రవికి ఖమ్మం జిల్లా సత్తుపల్లికాని, రంగారెడ్డి జిల్లా వికారాబాద్ నుంచి కాని పోటీ చేయించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు వారిని పార్టీలో చేర్చుకున్నారు. కేసీఆర్ ఇప్పటికే దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముమ్మరం చేసి 70 నియోజవర్గాల్లో అభ్యర్థుల పేర్లతో తొలిజాబితాను సిద్ధం చేసినట్టు సమాచారం. ఇదిలా ఉండగా గులాబీబాస్ గజ్వేల్ అసెంబ్లీ, మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం. టీఆర్‌ఎస్ సిద్ధం చేసిన జాబితా ఇలా ఉంది. మెదక్ అసెంబ్లీ నుంచి పద్మా దేవేందర్‌రెడ్డి, గజ్వేల్ నుంచి కేసీఆర్, సిద్దిపేట నుంచి హరీష్‌రావు, సంగారెడ్డి నుంచి చింతా ప్రభాకర్, ఆందోల్ నుంచి ఎర్రోల్ల శ్రీనివాస్, నల్లగొండ జిల్లా సూర్యాపేట నుంచి గుంతకండ్ల జగదీశ్వర్‌రెడ్డి, మిర్యాలగూడ నుంచి అలుగుబెల్లి రవీందర్‌రెడ్డి, తుంగతుర్తి నుంచి మందుల సామేల్, లేదంటే కడియం శ్రీహరి, కోదాడ నుంచి శశిధర్‌రెడ్డి, మునుగోడు నుంచి కర్నె ప్రభాకర్, భువనగిరి నుంచి టీఆర్‌ఎస్‌లోకి వస్తే జిట్టా బాలకృష్ణారెడ్డి, ఆలేరు నుంచి గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి శ్రీనివాస్‌గౌడ్, మక్తల్ నుంచి ఎల్లారెడ్డి, గద్వాల నుంచి కృష్ణామోహన్‌రెడ్డి, కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూలు నుంచి మర్రి జనార్దన్‌రెడ్డి, జడ్చర్ల నుంచి లక్ష్మారెడ్డి, కల్వకుర్తి నుంచి జైపాల్‌యాదవ్, అచ్చంపేట నుంచి గువ్వల బాలరాజు, వనపర్తి నుంచి నిరంజన్‌రెడ్డి, అలంపూర్ నుంచి మందా శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కామారెడ్డి నుంచి గంప గోవర్దన్, ఎల్లారెడ్డి నుంచి ఏనుగు రవీందర్‌రెడ్డి, బోధన్ నుంచి షౌకత్, ఆర్మూర్ నుంచి జీవన్‌రెడ్డి, కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నుంచి కేటీఆర్, హుజూరాబాద్ నుంచి ఈటెల రాజేందర్, ధర్మపురి నుంచి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్, వేములవాడు నుంచి చెన్నమనేని రమేశ్, పెద్దపల్లి నుంచి మనోహర్‌రెడ్డి, రామగుండం నుంచి సోమారపు సత్యనారాయణ, కోరుట్ల నుంచి కొత్త అభ్యర్థి, లేదా ప్రస్తుత ఎమ్మెల్యే కె. విద్యాసాగర్‌రావు, చొప్పదండ నుంచి శోభారాణి,
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్న దాస్యం వినయ్‌భాస్కర్‌ను తూర్పు నుంచి లేదా కొండా దంపతులు టీఆర్‌ఎస్‌లోకి వస్తే సురేఖకు తూర్పు, నర్సంపేట నుంచి పెద్ది సుదర్శన్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి తాటికొండ రాజయ్య, లేదా కడియం శ్రీహరి, పరకాల నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే భిక్షపతిని మార్చి కొండా సురేఖకు, వరంగల్ పశ్చిమ నుంచి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, డోర్నకల్ నుంచి సత్యవతి రాథోడ్, జనగామా నుంచి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మహబూబాబాద్ నుంచి ఇటీవల టీడీపీ నుంచి చేరిన నెహ్రూనాయక్, ఆదిలాబాద్ నుంచి జోగు రామన్న, మంచిర్యాల నుంచి దివాకర్‌రావు, సిర్పూర్‌కాగజ్‌నగర్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే కావేటి సమ్మయ్యను మార్చే అవకాశం ఉంది. బోథ్ నుంచి రాములునాయక్, చెన్నూరు నుంచి నల్లాల ఓదేలు, నిర్మల్ నుంచి శ్రీహరిరావు, రంగారెడ్డి జిల్లా పరిగి నుంచి హరీశ్వర్‌రెడ్డి, తాండూరు నుంచి పట్టణం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల నుంచి కేఎస్ రత్నం, వికారాబాద్ పిడమర్తి రవి, ఇబ్రహీంపట్నం నుంచి వెంకట్‌రెడ్డి ఎల్బీనగర్ నుంచి కాచం సత్యనారాయణ, లేదా జంగారెడ్డి పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. వీరి పేర్లను రెండు, మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశముంది.
టీఆర్‌ఎస్ మొదటి జాబితా సిద్ధం




