Wednesday, 4 November 2026

జలగం, పుట్ట మధుకు తెరాస తీర్థం

సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్‌
హైదరాబాద్‌, మార్చి 17 (జనంసాక్షి)
ఎన్నికలు సమీపిస్తున్నాకొద్దీ ఉద్యమ పార్టీలోకి కీలక నాయకులు వలస వస్తు న్నారు. ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన కీలక నాయకులు సోమవారం టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఖ మ్మం జిల్లా నేత మాజీ ఎమ్మెల్యే జలగం వెం కట్రావ్‌, మంథని నియోజకవర్గ నేత పుట్ట మధు, డాక్టర్‌ శంకర్‌నాయక్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ సాధన కోసం తెలంగాణ ప్రాంత కాం గ్రెస్‌ నేతలు చేసిందేవిూలేదని టీఆర్‌ఎస్‌ జాతీయ కార్యదర్శి కే కేశవరావు విమర్శించారు. తామేదో చేస్తే తెలంగాణ వచ్చిందన్న భావన వాళ్లలో ఉంద ని పేర్కొన్నారు. ఇప్పటికైనా టీకాంగ్‌ నేతలు పిచ్చి మాటలు మానుకోవాలని హితవు పలికారు. తెలం గాణ అభివృద్ధి కావాలంటే అది కేసీఆర్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. తెలంగాణ పునర్ని ర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యమనే విషయం టీఆర్‌ఎస్‌లోకి నేతల చేరికలే రుజువని వివరించారు. తెలంగాణ అభివృద్ధి కావాలంటే జాతీయ పార్టీలతో సాధ్యంకాదని, టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని వెల్లడించారు. ఇవాళ జలగం వెంకట్రావు, పుట్ట మధు పార్టీలోకి చేరడం టీఆర్‌ఎస్‌కు కొత్త ఉత్సాహాన్నిస్తుందని వెల్లడించారు. తాము పార్టీలోచేరడం ద్వారా ఖమ్మంలో పార్టీని బలోపేతం చేస్తామని జలగం తెలిపారు. కెసిఆర్‌ మాత్రమే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలరని అన్నారు. ఇదిలావుంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తమకు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రాంత నేతలు ఉద్యమించనున్నారు. ఈ మేరకు తెలంగాణ న్యాయవాదులకు కూడా ఎన్నికల్లో కొన్ని స్థానాలు కేటాయించాలని టీ అడ్వకేట్స్‌ జేఏసీ ఛైర్మన్‌ రాజేందర్‌రెడ్డి కోరారు. దీనిపై స్పందించకపోతే రెండు మూడు రోజుల్లో తమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *