Wednesday, 4 November 2026

మాటమీద నిలబడని లీడరే కేసీఆర్‌

టీ పీసీసీ చీఫ్‌ పొన్నాల
హైదరాబాద్‌, మార్చి 17 (జనంసాక్షి) :
మాట మీద నిలబడని లీడర్‌ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అని తెలంగాణ పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మ య్య అన్నారు. అలాంటి వ్యక్తి వ్యాఖ్యలపై స్పందిం చడం అంటే సమయం వృథా చేసుకోవటమని ఆయన పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ గురించి ఇక మా ట్లాడడం సరికాదన్నారు. సోమవారం హైదరాబా ద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరెలాం టి వారో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. తెలం గాణ ఇచ్చింది సోనియా కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఇస్‌ఏ పార్టీని విలీనం చేస్తాననన్నది కేసీఆర్‌ కాదా అని ప్రశ్నించారు. పటాన్‌చెరువు ఎమ్మెల్యే నందీశ్వర్‌ గౌడ్‌ పార్టీని వీడుతున్నారన్న వార్తలను ఆయన కొట్టి పారేశారు. నందీశ్వర్‌గౌడ్‌ ఎటూ వెళ్లరని కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని చెప్పారు. ఇలాంటి సమయంలో టీఆర్‌ఎస్‌ ఇంకా ఒంటరి పోరాటం చేస్తామనుకుంటే చేసేదేవిూ లేదన్నారు. పార్టీని నడపడం చిరంజీవి వల్ల సా ధ్యం కాకనే కాంగ్రెస్‌పార్టీలో పీఆర్పీని విలీనం చేశారని కాంగ్రెస్‌ నేత గండ్రవెంకటరమణా రెడ్డి అన్నారు. పవన్‌కళ్యాణ్‌ ఓ పిల్ల కాకి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ మహా సముద్రం లాంటిదని, కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయడం ఎవరివల్లా సాధ్యం కాదని స్పష్టం చేశారు. కరీంనగర్‌ చొప్పదండి టిడిపి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య టీఆర్‌ఎస్‌లో వెళతారని ప్రచారం జరిగింది. కానీ ఆయన సోమవారం టి.కాంగ్రెస్‌ శిబిరంలో ప్రత్యక్షమయ్యారు. పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్యతో ఆయన భేటీ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *