హైదరాబాద్, మార్చి 17 (జనంసాక్షి) :
తెలంగాణలోని నాలుగున్న కోట్ల తెలంగాణ ప్రజలే టీఆర్‌ఎస్ పార్టీకి హై కమాండ్ అని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. తాము కాంగ్రెస్ లాగా ఢిల్లీకి లేదా టిడిపి లాగా సీ మాంధ్ర నాయకత్వానికి సమాధానంచెప్పుకోవాల్సిన పనిల ేదన్నారు. తెలంగాణ రాష్ట్రసమితిలో చేరిన మాజీ ఎమ్మెల్యే జల గం వెంకట్రావ్, కరీంనగర్ జిల్లా మంథనికి చెందిన పుట్టా మ ధులతో కలసి ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో పార్టీ సెక్రెటరీ జనరల్ కె. కేశ్వరావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా సర్వే నివేదికలు ఉండటంతో కాంగ్రెస్, టీడీపీల్లో వణుకు పుడుతోందన్నారు. ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని తాకట్టు పెట్టాలని చూస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్‌తో టిఆర్‌ఎస్ కలసిపోతుందని ప్రచారం చేసిన చంద్రబాబు ఇవాళ కలవకున్నా దుష్ప్రచారం ఏస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. తాము తెలంగౄణ ఏర్పాటు లక్ష్యంగా టిఆర్‌ఎస్ పుట్టిందని, గమ్యాన్ని సాధించినా లక్ష్యం మిగిలిందని అన్నారు. అందుకే సొంత అస్తిత్వం కోసం ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయాలని నిర్ణయించామన్నారు. ఇది టిడిపికి మింగుడు పడడం లేదన్నారు. టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపుమనడానికి కాంగ్రెస్ నేతలెవరని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌కు ఒక అస్థిత్వముందని, అది ఎవరో పెడితే పుట్టిందికాదని తెలంగాణ ప్రజల హదయాల్లో నుంచి వచ్చిందని తెలిపారు. అందుకే టీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఢిల్లీ హైకమాండ్ అయితే, టీడీపీకి సీమాంధ్ర హైకమాండ్ అని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ను విలీనం చేయాలన్నా, కొనసాగించాలన్న హైకమాండ్ తెలంగాణ ప్రజల అభిప్రాయం ముఖ్యమని తెలిపారు. ప్రజలు తమకు ఏ అభిప్రాయం చెబితే అది చేస్తామని వెల్లడించారు. నాలుగున్నర కోట్ల ప్రజల నవ నిర్మాణానికి టీఆర్‌ఎస్ పుట్టిందని వెల్లడించారు. కాంగ్రెస్, టీడీపీలు కలిసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చే పార్టీ టీఆర్‌ఎస్ అని స్పష్టం చేశారు. సీమాంధ్ర పార్టీలు ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి పూర్తిగా విచిత్రంగా ఉందని, ఆయన దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నాడని హరీష్‌రావు విమర్శించారు.




