Tuesday, 3 November 2026

మోడీ దేశాన్ని మత ప్రాతిపదికపై విభజిస్తాడు


లౌకికవాద పునాదులను ఎవరూ కూల్చలేరు : రాహుల్‌

హపోలి, మార్చి 18 (జనంసాక్షి) :
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ దేశాన్ని మత ప్రాతిపదికన విభజిస్తాడని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్య క్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. బీజేపీ విధానం వల్ల దేశ లౌకికవాదం ప్రమాదంలో పడుతుందని, వినా శనమయ్యే అవకాముందని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం అరుణాచల్‌ప్రదేశ్‌లోని హపోలిలో ఆ యన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కులాలు, మతాలకు అతీతంగా దేశ ప్రజలను ఏకతాటిపై ఉంచ డమే తమ పార్టీ సిద్ధామంతని ఆయన పునరుద్ఘాటిం చారు. రాజకీయంగా, మతపరంగా ప్రజలను విభజిం చాలని భాజపా కోరుకుంటోందని ఆయన మండిపడా ్డరు. కానే తాము ప్రజలు, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్నారు. అరుణచల్‌ప్రదేశ్‌ భారత్‌లో అంతర్భాగమని, ఇక్కడి ప్రజలు తమ సొంతరాష్ట్రంలో ఉన్నట్లే నివసించవచ్చని తెలిపారు. బీజేపీ అనుసరిస్తున్న మత పరమైన సిద్ధాం తాల వల్ల దేశంలో లౌకిక స్ఫూర్తికి భంగం వాటిల్లిం దని, మోడీ కనుక ప్రధాని అయితే భారత్‌లో లౌకికవాదాన్ని వెదుక్కోవాల్సిన దుస్థితి దాపురిస్తుందని అన్నారు. బీజేపీ విధానాల వల్లే ఈశాన్య రాష్ట్రాల ప్రజలు వివక్షను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇందుకు ఢిల్లీలో అరుణాచల్‌ విద్యార్థి నిడో తానియా జనవరి 29న హత్యకు గురవడం ఒక్క ఉదాహరణ అని చెప్పారు. ప్రజల మధ్య ద్వేషాన్ని రగల్చే బీజేపీని దూరం పెట్టాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్రత, సమైక్యత కోసం కాంగ్రెస్‌కు అండగా నిలువాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా యూపీఏ ప్రభుత్వ విజయాలు, ప్రజా సంక్షేమం కోసం తెచ్చిన పథకాలను వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *