Tuesday, 3 November 2026

అలకవీడిన అద్వానీ

గాంధీనగర్‌ నుంచే పోటీన్యూఢిల్లీ, మార్చి 20 (జనంసాక్షి) :

బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ అలకవీడారు. గాం ధీనగర్‌ నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. తాను నియోజకవర్గం మారాలనుకుంటున్నట్టు పార్టీ అధిష్టా నానికి వివరించిన అద్వానీ, అదే పట్టుదలతో ఇన్నాళ్లుఉన్నారు. దీంతో బీజేపీ అగ్రనేతలు ఎం.వెంకయ్య నా యుడు, సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీ, తదితరులు గురు వారం ఉదయం నుంచి అద్వానీ నివాసానికి చేరు కుని ఆయనతో చర్చలు నిర్వహిస్తున్నారు. ఐదుసార్లు పోటీ చేసిన గుజరాత్‌లోని గాంధీనగర్‌ స్థానానికి బదులుగా ఈసారి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ నుంచి బరిలో దిగాలనుకున్న ఆయన కోరికను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ త్రోసిపుచ్చింది. పార్టీలోని సీనియర్లకు కోరుకున్న చోట సీట్లు కేటాయించడం ఆనవాయితీ. భోపాల్‌ స్థానాన్ని కేటాయించాలన్న ఆయన విజ్ఞప్తిని అధిష్టానం తిరస్కరించింది. అద్వానీ ఈసారి కూడా గాంధీనగర్‌ నుంచే పోటీ చేయాలని నిర్ణయించింది. అద్వానీ కినుక వహించారు. అగ్రనేతలందరూ ఆయన్ను కలుసుకుని నచ్చజెప్పారు. ఇదిలా ఉండగా బిజెపి ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, గుజరాత్‌లోని వడోదరా నుంచి ఎన్నికల బరిలోకి దిగిన విషయం తెలిసిందే. మిగతా నేతలు కోరుకున్న నియోజకవర్గాలు ఇచ్చిన పార్టీ తనను మాత్రం ఇబ్బంది పెడుతున్నట్టు ఆయన అలక వహించారు. చివరికి పార్టీ ప్రముఖుల జోక్యంతో ఆయన పట్టువీడి గాంధీనగర్‌ నుంచి పోటీకి ఓకే చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *