Tuesday, 3 November 2026

ఒంటరిపోరుకు సిద్ధం కండి

బీజేపీ సీనియర్‌ నేత జవదేకర్‌

విజయవాడ, మార్చి 21 (జనంసాక్షి) :
బీజేపీ శ్రేణులు ఒంటరి పోరుకు సిద్ధం కావా లని ఆ పార్టీ సీనియర్‌ నేత అధికార ప్రతినిధి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. విజయవాడలో నిర్వహించిన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీమాంధ్రకు ప్రధాని ఇచ్చిన హామీలు నెరవేరాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు. రాయ లసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. నీటి సమస్యలు, విద్యుత్‌ సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేశారు. బీజేపీకిసీమాంధ్ర తరఫున ఒక్క ఎంపీ కూడా లేకపోయినప్పటికీ సీమాంధ్ర ప్రాంత హక్కుల కోసం బిజెపి పోరాడిందని అన్నారు. బిజెపితో కలిసి నడిచేందుకు అనేక పార్టీలు ఆసక్తి చూపుతున్నాయి. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తమతో కలిసి వచ్చే పార్టీలతో కలిసి పనిచేయాలని నిర్ణయించామని తెలిపారు. అందరి సలహాలు, సంప్రదింపులతోనే పొత్తుపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించారు. సీమాంధ్ర అభివృద్ధి చెందాలంటే బీజేపీకే ఓటు వేయాలని కేంద్ర మాజీ మంత్రి, బిజెపి నేత దగ్గుబాటి పురందరేశ్వరి అన్నారు. శుక్రవారం బిజెపి అధికార ప్రతినిధి జవదేకర్‌ నేతృత్వంలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. విభజన వల్ల జరిగే నష్టాన్ని ఎలా భర్తీ చేయనున్నారని ప్రశ్నించినా కాంగ్రెస్‌ అధిష్టానం పట్టించుకోలేదు. తాము చేసిన ప్రతిపాదనలకు విలువ లేకుండా పోయింది. తమ ప్రతిపాదనలను పట్టించుకోకుండా ఏకపక్షంగా బిల్లును ఆమోదింప జేసుకున్నారు. విభజన బిల్లును ఆమోదిస్తే రాజీనామా చేస్తానని ముందుగానే సోనియాకు వెల్లడించాను. సీమాంధ్రకు ప్యాకేజీ కోసం రాజ్యసభలో వెంకయ్యనాయుడు పోరాడిన తీరు అందరికీ తెలిసిందేనన్నారు. కాంగ్రెస్‌ పార్టీపై ప్రజల్లో నమ్మకం పోయింది. తాము చేసిన పోరాటానికి ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. సీమాంధ్రలో బిజెపిని గెలిపించాలి. బిజెపితోనే సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలు వస్తాయి.. అభివృద్ది సాధ్యమవుతుందని అన్నారు. విభజన నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో తెలుగువాడి పౌరుషాన్ని తేటతెల్లం చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *